Take a fresh look at your lifestyle.

సాదా బైనామాకు 10 కే లాస్ట్…

  • సాదాబైనామాల క్రమబద్ధీకరణ కు ఇదే చివరి అవకాశం…
  • రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
  • మున్సిపల్ విలీన గ్రామాలకు కూడా సాదా బైనామా వర్తిస్తుంది..
  • సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు టెలి కాన్ఫనరెన్స్

సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పిస్తోన్న చివరి అవకాశం ఇదేనని, ఈ నెల పదో తేదీలోగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు కోరారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి ఆయన సిద్ధిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగు చేసే ప్రతీ భూమికి పాస్ బుక్ ఉండాలని తద్వారా ప్రభుత్వం నుంచి అందే రైతు బంధు సాయం, రైతు బీమా వంటి పథకాలు అందుతాయని చెప్పారు. పంట లు అమ్ముకోవాలన్నా , పాస్ బుక్ ఉండటం వలన వారికి ప్రభుత్వ మద్దతు ధర లాంటి సహాయము అందుతాయ్.. తెల్లకాగితం పై రాసుకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని అటు వంటి దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి పట్టాలు ఇస్తుందన్నారు. ఒక వేళ తాతల నాటి నుంచి వంశపారంపర్యంగా భూమి సంక్రమించి ఉండి, ఎలాంటి కాగితాలు రాసుకోకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని. అటు వంటి దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి పట్టాలు ఇస్తుందని చెప్పారు. తొలి సారిగా మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో భూములను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమబద్ధీకరించుకునేందురు అవకాశం ఇచ్చారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సిద్ధిపేట మున్సిపల్ విలీనం అయిన గ్రామాలు నర్సాపూర్ , లింగారెడ్డి పల్లి, గాడి చెర్ల పల్లి , రంగదాంపల్లి తదితర గ్రామాలకు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు.. ఈ నెల 10 వ తేదీతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ గడువు ముగుస్తుందని ఎట్టి పరిస్థితుల్లోను ఈ అవకాశాన్ని రైతులు జారవిడుచుకోకుండా జాగృతం చేయాలని మంత్రి హరీశ్ రావు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుకు సూచించారు. గ్రామాల్లో సర్పంచ్ లు మైక్ ల ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించాలన్నారు. మీసే వా కేంద్రాలకు తీసుకువెళ్లి వారు దరఖాస్తు చేసేలా జాగృతం చేయాలన్నారు. గడువు ముగిసాక ఈ భూముల విషయంలో ఎవరూ ఏమి చేయలేరన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఇప్పుడు భూముల డిజిటలైజేషన్ ధరణి పోర్టల్ ద్వారా జరుగుతోందని చెప్పారు. పాస్ బుక్ లు ఉంటేనే ధరణి పోర్టల్ లో భూముల వివరాలు పొందుపరిచే అవకాశం ఉంటుందని, సాదాబైనామాల అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. సర్పంచ్ లు, రైతు బంధు కమిటీలు ఈవిషయంలో చురుకుగా పని చేయాలన్నారు. ధరణి పోర్టల్ ద్వాార భూ క్రయ విక్రయాలన్నీ పది హేను నిముషాల్లోగా పూర్తవుతాయన్నారు. అవినీతి, లంచాలు లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పారదర్శకరంగా జరుగుతాయని వివరించారు. ధరణి ఫలాలు ప్రజలు అందేలా ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు.

మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
మక్కల , పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి.. కానీ చోట్ల ప్రాభించాలాని చెప్పారు.. ప్రారంభం అయిన చోట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పి ఏ సి ఎస్ చైర్మన్ , రైతు బంధు నాయకులు మానిటరింగ్ చేయాలి..ఎక్కడెయిన ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుక రావాలని చెప్పారు.. రైతులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply