Take a fresh look at your lifestyle.

పదో తరగతి పరీక్షలు వాయిదా….!

* రాష్ట్ర వ్యాప్తంగా  నిలిపివేత….

*పరీక్షలపై తొలిగిన  ఉత్కంఠ

   తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎమ్‌సీ, రంగారెడ్డి జిల్లాలు  మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇవ్వగా.. ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను  వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో  కొరోనా తీవ్రత తగ్గాక టెన్త్ ‌పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే 10 వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 10 వ తరగతి పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది

Leave a Reply