Take a fresh look at your lifestyle.

ఎపిలో చిరు వ్యాపారులకు రూ.10 వేల వడ్డీలేని రుణం

  • రూ.395 కోట్లను విడుదల చేసిన సిఎం జగన్‌
  • ‌బటన్‌ ‌నొక్కి ఖాతాల్లోకి నగదు జమ

అమరావతి, జనవరి 11 : ఆంధప్రదేశ్‌లో చిరు వ్యాపారులకు జగన్‌ ‌సర్కార్‌ అం‌డగా నిలిచింది. ఈ ఏడాది కూడా జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌బటన్‌ ‌నొక్కి వారి అకౌంట్‌లలో డబ్బులు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణం.. మొత్తం రూ.395 కోట్లను విడుదల చేశారు. జిల్లాల నుంచి మంత్రులు, కలెక్టర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు. సీఎం కొంతమంది లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడారు. తన పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని.. అప్పుడే వారికి ఏదైనా మంచి చేయాలని భావించానన్నారు. చిరు వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే లబ్దిదారుల వడ్డీ భరిస్తుంది అన్నారు జగన్‌. ఇం‌కా ఏవరైనా అర్హత ఉండి కూడా పథకం అందకపోతే.. వారికి కూడా లబ్ది చేకూరుస్తామన్నారు. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారుల జీవనోపాధికి ఉపయోగపడుతోందని.. వ్యాపారులకు పెట్టుబడికి కష్టం రాకూడదనే ఇలా రుణం అందజేస్తున్నామన్నారు.

చిరు వ్యాపారులకు ఒక్కొక్కిరికి రూ.10వేల చొప్పున ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ ‌చేశామని చెప్పారు. లబ్దిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారన్నారు. తాడేపల్లి క్యాంప్‌ ‌కార్యాలయంలో జగనన్న తోడు పథకానికి  సీఎం జగన్‌  ‌బటన్‌ ‌నొక్కి నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం చేతివృత్తుల కళాకారులకు ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అదిమూలపు సురేష్‌, ‌ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి రుణాలు, వడ్డీ మాఫీ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్లు కొత్త రుణాలు మంజూరు చేశామన్నారు. గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ ‌విడుదల చేశామని, సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందన్నారు. రూ. 3.67 లక్షల మంది రెన్యువల్‌గా రుణాలు తీసుకుంటుండగా.. 28 వేల మందికి కొత్తగా రుణాలిస్తున్నామని సీఎం జగన్‌ ‌తెలిపారు. జగనన్న తోడు ద్వారా వ్యాపారాలు చేసుకునేందుకు ఏ ఒక్కరిపై ఆధారపడకుండా వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు.

Leave a Reply