Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో రోజుకు.. 10 లక్షల కొరోనా టీకాలు

  • కొరోనా టీకా ఇచ్చేలా ఏర్పాట్లు
  • బ్రిటన్‌ ‌నుంచి వొచ్చిన వారిలో 900 మంది గుర్తింపు
  • ఐదారుగురికి మాత్రమే పాజిటివ్‌ : ‌మంత్రి ఈటల

రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 10 లక్ష మందికి కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌వేసేలా ప్రిపేర్‌ అయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వెల్లడించారు. కరీంనగర్‌లో ఆయన డియాతో మాట్లాడుతూ..కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌వొచ్చిన సందర్భాలు తెలంగాణలో లేవని స్పష్టం చేశారు. ఇక, బ్రిటన్‌ ‌నుండి 1200 మంది రాష్ట్రానికి వొచ్చారన్న ఆయన..ఇప్పటికే 900 మందిని ట్రేస్‌ ‌చేశామని.. వారిలో కూడా ఐదు, ఆరు మందికి మాత్రమే కోవిడ్‌ ‌పాజిటివ్‌గా తేలిందన్నారు. మిగతావారి కోసం ట్రేసింగ్‌ ‌కొనసాగుతోందని వెల్లడించిన మంత్రి ఈటల.. వొచ్చే నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌జనవరిలో వొచ్చే అవకాశం ఉందని.. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ ‌పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా, కోవిడ్‌ ‌టీకా పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటగా…కోవిడ్‌ ‌వారియర్స్‌కు ఈ వ్యాక్సిన్‌ ‌పంపిణీ చేయనుండగా.. ఆ తర్వాత వృద్ధులు, చిన్నపిల్లలు, కోవిడ్‌ ‌బారినపడినవారు ఇలా ప్రాధాన్యతను బట్టి వ్యాక్సిన్‌ ‌పంపిణీ చేయనున్నారు. కాగా కొరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‘‌డ్రై రన్‌’‌కు ఎంపిక చేసిన కేంద్రం..ఈ నెల 28, 29 తేదీల్లో ఈ స్పెషల్‌ ‌డ్రైవ్‌ను నిర్వహించనుంది. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వ్యాక్సిన్‌ ‌పంపిణీ చేపట్టనున్నారు. దీనిపై అన్ని రాష్ట్రాలు ఫోకస్‌ ‌పెట్టాయి.

Leave a Reply