Take a fresh look at your lifestyle.

మృతుల కుటుంబాలకు కోటి పరిహారం

  • వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25లక్షలు
  • ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు
  • గ్యాస్‌ ‌లీకేజీపై అధికారులతో సిఎం సక్ష
  • కెజిహెచ్‌లో బాధితులకు జగన్‌ ‌పరామర్శ

విశాఖపట్టణం,మే 7: విశాఖ మృతులకు సీఎం జగన్‌ ‌నష్ట పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం ప్రకటించారు. వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25లక్షలు ఇస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో రెండు మూడు రోజులుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.లక్ష ఇస్తామని జగన్‌ ‌హా ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. విశాఖ ఘటన బాధాకరమని జగన్‌ ‌చెప్పారు. ప్రముఖ కంపెనీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమని, ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అధ్యయనం చేస్తారని తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ప్రమాదం జరిగినప్పుడు అలారమ్‌ ‌మోగాలని, కానీ అలా జరగలేదని జగన్‌ ‌పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారని, అపస్మారక స్థితిలో ఉన్న వారు కోలుకుంటున్నారని జగన్‌ ‌తెలిపారు. విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గ్యాస్‌ ‌లీకేజీ సంఘటనపై ఉన్నతాధికారులతో సక్ష నిర్వహించారు.

సంఘటనపై అధికారులతో చర్చించారు. గ్యాస్‌ ‌లీకేజీ, అనంతరం తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌ ఈ ‌సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్‌ ‌లీక్‌ ‌ఘటనలో ఇప్పటివరకు 9 మంది చనిపోయినట్లు తెలిపారు. అంతకు ముందు సీఎం జగన్‌ ‌కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. దుర్ఘటనపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాగా ఆర్‌ఆర్‌ ‌వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ ‌పరిశ్రమలో రసాయన వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. అంతకుముందు గ్యాస్‌ ‌లీక్‌ ‌బాధితులను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. స్థానిక కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం ఓదార్చారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసు కున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశి ంచారు. ఆస్పత్రిలో చికిత్స పొందున్న వారితో మాట్లాడి ప్రమాద విషయాలను అడిగి తెలుసు కున్నారు. గ్యాస్‌ ‌దుర్ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధకరమని సీఎం జగన్‌ ‌విచారం వ్యక్తం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

Leave a Reply