Take a fresh look at your lifestyle.

కాశ్మీర్‌లో కుప్పకూలిన పర్యాటక రంగం.. ఉపాధి కోల్పోయిన 1.44లక్షల మంది .!

 ‌”కమ్యూనికేషన్‌ ‌సౌకర్యాల స్తంభన వల్ల రాష్ట్రంలో అనేక రంగాలు దెబ్బతిన్నాయి.   రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి  (జిడిపి)లో  పర్యాటకం వాటా  7 శాతం. ఇప్పుడుఈ ఆంక్షల కారణంగా  పర్యాటక రంగం వెన్ను విరిగింది. కాశ్మీర్‌ ‌టూరిజం శాఖలో  1,44, 500 ఉద్యోగాలు ఊడాయి.     చేతి వృత్తి  పనివారు,    పర్యాటక సంస్థల్లో పని చేసే వారూ,   ఉపాధి కోల్పోయారు.  కాశ్మీర్‌ ‌శాలువలు, తివాచీల దుకాణాల మూత వల్ల   చేతివృత్తి  విభాగాల్లో పని చేసేవారు ఉపాధి కోల్పోయారు.”

Boat at Doll Searcher in Srinagar

శ్రీనగర్‌ ‌లోని డాల్‌ ‌సరస్సులో పడవ నడిపే సరంగు అందించిన సమాచారం ప్రకారం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ సరస్సును సందర్శించే వారిని పడవల్లో అన్ని ప్రాంతాలు తిప్పేందకు నాలుగు వేల మంది సరంగులు పని చేసే వారట.కాశ్మీర్‌లో 370వ అధికరణం రద్దు తర్వాత ఆంక్షల కారణంగా వీరంతా ఉపాధి కోల్పోయారు. అలాగే, కాశ్మీర్‌ ‌ను సందర్శించే పర్యాటకులు 86 శాతం తగ్గారు. అంతర్జాలాన్ని కొంత కాలం పూర్తిగానూ, మరి కొంత కాలం పాక్షికంగానూ నిలిపివేయడం వల్ల కూడా పర్యాటక రంగం దెబ్బతింది.పర్యాటకుల ఆగమనానికి ఇదే సీజన్‌. ఈ ‌సమయంలో పర్యాటకులు రాకపోతే తాను కూడా ఉద్యోగం కోల్పోవల్సి వస్తుందని గులామ్‌ ‌జిలానీ అన్నారు. శ్రీనగర్‌ ‌లో డాల్‌ ‌సరస్సు సమీపంలోని ఒక హోటల్‌ ‌మేనేజర్‌ ‌ను అతడి యజమాని హెచ్చరించాడట. 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్‌ ‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పడిపోయింది. కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో కాశ్మీర్‌ ‌సమాచారం బయట ప్రపంచానికి తెలియడం లేదు. భద్రతా పరమైన ఆంక్షలు కారణంగా శ్రీనగర్‌ ‌కు పర్యాటకులు ఎవరూ రావడం లేదు. సైనికుల బూట్ల చప్పుళ్ళతో శ్రీనగర్‌ ‌వీధుల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆరు నెలలుగా కాశ్మీర్‌ ‌యావత్‌ ‌ప్రపంచానికి దూరంగా ఉంటోంది. భద్రతా ఆంక్షలు సడలించినా, భారీగా సైన్యాన్ని మోహరించడం వల్ల కాశ్మీర్‌ ‌కి ఎవరూ రావడం లేదు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అంతర్జాలాన్ని ఈ మధ్యనే పునరుద్దరించారు. టూజీ మొబైల్స్ ‌డాటా పోస్టు పెయిడ్‌ ‌మొబైల్‌ ‌ఫోన్‌ ‌లలో లభిస్తోంది. జిలానీ పని చేసే హోటల్లో మొత్తం 88 రూం లలో 2019 ఆగస్టు ఐదవ తేదీన 63 వరకూ పర్యాటకుల కోసం బుక్‌ అయ్యాయి. 370 అధికరణం రద్దు తర్వాత రూం ల సంఖ్య మూడుకు తగ్గింది. కాశ్మీర్‌ ‌కు 2018లో 316434 మంది పర్యాటకులు వచ్చారు గత ఆగస్టు నుంచి డిసెంబర్‌ ‌వరకూ లెక్క వేస్తే పర్యాటకుల సంఖ్య 43, 059కి తగ్గింది, అంటే 86 శాతం పర్యాటకులు రాలేదన్న మాట గత జూలైలో 1,52,525 మంది పర్యాటకులు రాగా, ఆగస్టులో 10,130 మంది మాత్రమే వచ్చారు. సెప్టెంబర్‌ ‌లో ఇంకా తక్కువ మంది అంటే 4,562 మంది వచ్చారు. నవంబర్‌ ‌లో పరిస్థితి కొద్దిగా మెరుగు పడింది. గుల్మార్గ్ ‌లో జరిగిన వింటర్‌ ‌గేమ్స్ ‌పర్యాటకుల సంఖ్య పెరిగింది. డిసెంబర్‌ ‌లో మళ్ళీ ఈ సంఖ్య పడిపోయింది. ఆర్థిక రంగంలో మందగమనం ఉనప్పటికీ కాశ్మీర్‌ ‌కి పర్యాటకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదని టూరిజం మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి అన్నారు. పర్యాటకుల్లో ఎక్కువ మంది వైష్ణో దేవి ఆలయాన్ని సందర్సించిన భక్తులే ఉన్నారు.

కమ్యూనికేషన్‌ ‌సౌకర్యాల స్తంభన వల్ల రాష్ట్రంలో అనేక రంగాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో పర్యాటకం వాటా 7 శాతం . ఇప్పుడుఈ ఆంక్షల కారణంగా పర్యాటక రంగం వెన్ను విరిగింది. కాశ్మీర్‌ ‌టూరిజం శాఖలో 1,44, 500 ఉద్యోగాలు ఊడాయి. చేతి వృత్తి పనివారు, పర్యాటక సంస్థల్లో పని చేసే వారూ, ఉపాధి కోల్పోయారు. కాశ్మీర్‌ ‌శాలువలు, తివాచీల దుకాణాల మూత వల్ల చేతివృత్తి విభాగాల్లో పని చేసేవారు ఉపాధి కోల్పోయారు. హొటల్‌ ‌మేనేజర్‌ ‌నెలకు 22వేలు జీతాన్ని పొందేవాడు. ఆంక్షల కారణంగా అతడు ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోల్పోయాడు. రాష్ట్రంలో వాణిజ్య రంగానికి 15,000 కోట్లు మేరకు నష్టం వచ్చిందనీ, 4,96,00 మంది ఉపాధి కోల్పోయారని చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌వర్గాలు తెలిపాయి. చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు చితికి పోయారు. అప్పుల పాలయ్యారు. కొందరైతే పస్తులున్నారు ఎంత కాలం ఇలా రోజులు నెట్టుకొస్తామని జిలానీ ప్రశ్నించారు. ‘‘నిర్మాణ రంగంలో కార్మికులకు ఎక్కడా పని దొరకడం లేదు. మామూలు రోజుల్లో షికారాలు రోజుకు 1500 నుంచి 2,000 సంపాదించేవారు. 370 వ్యతిరేక ఆందోళనల వల్ల పర్యాటకం మరింత దెబ్బతినగలదేమోనన్న ఆందోళనమను జిలానీ వ్యక్తం చేసారు.

Tags: 1.44 lakhs peoples, lost employment in Kashmir,Collapse communication, facilities

Leave a Reply