Take a fresh look at your lifestyle.

తెలంగాణాకి ఉచితంగా 1.06 కోట్ల మోతాదుల వాక్సిన్ : కేంద్రం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ జూలై 23: కొరోనా వైరస్ ఎదుర్కోటానికి జాతీయ టీకా విధానం ప్రకారం ప్రభుత్వం రాష్ట్రాలు, యుటి లకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందా? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిన వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య ఎంత… అని తెలంగాణ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం పార్లమెంట్ లో ప్రశ్నిచారు. దీనికి ప్రభుత్వం ఇలా సమాధానం ఇచ్చింది.. ‘జాతీయ కోవిడ్ విధానం అమలు కోసం సవరించిన మార్గదర్శకాల ప్రకారం టీకా కార్యక్రమం ‘జూన్ 21, 2021 నుండి అమల్లోకి వచ్చింది. దేశంలో తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75% భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఈ టీకాలు రాష్ట్రాలు ,యుటి లకు ఉచితంగా కేంద్రం ఇస్తున్నది. 2021 జూలై 20 నాటికి, మొత్తం 1.59 కోట్ల మోతాదు కోవిడ్ -19 వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సరఫరా చేసింది. వీటిలో 1.06 కోట్ల మోతాదులను భారత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. 9.25 లక్షల మోతాదులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.మరో 43.59 లక్షల మోతాదులను ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్నాయి. ఒకటి మే 2021 నుండి 13 జూలై 2021 మధ్య, తెలంగాణలో మొత్తం 60.29 లక్షల మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చారు.మరో తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానంగా డిసెంబర్ చివరి నాటికి 100 కోట్ల డోస్ ల సరఫరాకు ఆదేశాలిచ్చాం కేంద్రం సమాధానం చెప్పింది.

డిసెంబర్‌ చివరి వరకు 100.6 కోట్ల డోస్‌లను సరఫరా చేయడానికి కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 20 వ తేది మధ్య వ్యాక్సిన్ డోసుల్లో 56 శాతం మోతాదులను గ్రామీణ వ్యాక్సిన్ సెంటర్ లో వినియోగించినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం కేటాయించిన 35వేల కోట్ల బడ్జెట్‌లో జూలై నాటికి 8071.09 కోట్లు ఖర్చు చేసినట్లు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి రాతతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 1, 222 ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు కాగా, ప్రస్తుతం 245 ప్లాంట్స్‌ ఏర్పాటు అయ్యాయని వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం 1, 244 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఉండగా, అందులో 225 ట్యాంకర్లను గతేడాది మార్చి తర్వాత అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలు, మండలాల్లో కోవిడ్‌ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇండియా కోవిడ్‌–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ అండ్‌ హెల్త్‌ సిస్టం ప్రిపేర్డ్‌నెస్‌ ప్యాకేజీ రెండో దశకు 23,123 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

అటవీ నిర్మూలన చట్టం కింద తెలంగాణ కు 3110.38 కోట్ల రూపాయలు ఇచ్చాం: కేంద్రం
అటవీ నిర్మూలన పరిహార నిధి చట్టం 2016 అమలులోకి వచ్చిన తరువాత గత రెండేళ్ళలో నేషనల్‌ అథారిటీ నుంచి తెలంగాణకు 3110.38 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. 2019 ఆగస్టు నుంచి 2021 జనవరి మధ్య దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,477.77 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ వివరాలు కేంద్రం తెలిపింది.అలాగే ఏపికి 1734.81 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply