హైదరాబాద్‌ ‌సిగలో మరో మణిహారం

మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌
ఐటి ఆఫీసులకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు
మొదటి దశలో మొత్తం 23 కిలోవి•టర్ల  మేర నిర్మాణం
సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌కు సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ‌మరో మణిహారం అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితమైన, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రజా ఉపయోగకరమైన నాన్‌ ‌మోటరైజ్ట్ ‌ట్రాన్స్ ‌పోర్టు సొల్యూషన్‌ను ప్రమోట్‌ ‌చేయాలన్న ఉద్దేశంతో ఈ సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇది మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌ అని చెప్పారు. స్థానికంగా ఉండే వ్యక్తులు ఆఫీస్‌కు సైకిల్‌పై వేళ్లేందుకు ఉపయోగపడాలని ముఖ్య ఉద్దేశంతో సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దుబాయ్‌, ‌జర్మనీ లాంటి విదేశాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేసి సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌నానక్‌ ‌రామ్‌ ‌గూడ వద్ద సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్‌ ‌భూమిపూజ చేశారు. మొదటి దశలో మొత్తం 23 కిలోమీటర్ల మేర 4.5మీటర్ల వెడల్పుతో సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. 16 మెగా వాట్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా సోలార్‌ ‌రూఫ్‌ను ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హెచ్‌ఎం‌డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. నానక్‌ ‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్‌ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు…నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ‌ట్రాక్‌ ‌నిర్మాణం జరుగనుంది.

మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ను.. 16 మెగావాట్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌ ‌మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా పెట్టుకున్నది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే..ప్రజా ఉపయోగమైన నాన్‌ ‌మోటరైజ్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌సెల్యూషన్స్‌ను ఉద్దేశంతో ట్రాక్‌ను శంకుస్థాపన చేశామన్నారు. గత ఆరు నెలల కిందట ఓ మిత్రుడు సౌత్‌ ‌కొరియాలో సైక్లింగ్‌ ‌ట్రాక్‌ ఉం‌దని, హైవే మధ్యలో సోలార్‌ ‌ప్యాన్లతో కట్టారు..చూడడానికి బాగుంది.. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భారత్‌లో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు..ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుచేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దానికి అనుగుణంగా అధికారులను సౌత్‌ ‌కొరియాకు వ్యక్తిగతంగా పంపామని, ఆ తర్వాత దుబాయిలో బాగుందంటే వెళ్లి అక్కడి మోడల్‌ను స్టడీ చేశారన్నారు. విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్‌ ‌నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్‌ ‌చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్‌కి వెళ్లికి రాకుండా ఫిజికల్‌ ‌ఫిట్‌నెస్‌ ‌కోసం సైతం బాగుంటుందన్నారు.

ప్రస్తుతం అందరికీ ఫిజికల్‌ ‌ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగిందన్నారు. 24 గంటలు ఈ ట్రాక్‌ అం‌దుబాటులో ఉంటుందని, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లందరికీ ఉత్సాహ పరిచేలా భారత్‌లో తొలిసారిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. శంకుస్థాపన చేయడంతో పాటు మోడల్‌ ‌డెమో కింద 50 మీటర్లు తయారు చేశామన్నారు. జర్మనీ, సౌత్‌ ‌కొరియా, ఇతర దేశాలకు దీటుగా నాలుగున్నరమీటర్ల వైశాల్యంతో ప్రపంచ స్థాయి నిర్మించామన్నారు. భవిష్యత్‌ అం‌తర్జాతీయ సైక్లింగ్‌ ‌టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎం‌పీ రంజిత్‌ ‌రెడ్డి, రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ ‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *