Take a fresh look at your lifestyle.

యుద్ధం – విషాదం

యుద్ధమంటే వినాశనమే
విన్యాస్యాలతో ప్రాణనష్టమే
ఆ నష్టమంతా ఏమెరుగని సామాన్యలదే
ఊపిరింతా బూడిదైపోతోంది
పుడమంతా రక్తసిక్తమై దిక్కులేనిదై దీనంగా
మనవత్వం మరచిన
మనిషి సృష్టించే మారణహోమంలో
తనలోని శక్తినంతా కోల్పోయి
దగాకోరు సమాజంలో
మోడుబారుతనాన్ని అలంకరించుకున్న శిలై తల్లడిల్లుతోంది

ఎన్ని గుండెలు అల్లాడుతున్నాయో
మేధస్సెంత మెదడునింపుకుంటేమి?
నరాలుచిట్లి మనిషిని శవాలుగాజేసి
మట్టినిసైతం మాయంజేసుందుకే
ఆధిపత్యాహంకారధోరణితో
ఎన్నో శిఖరాలనదిరోహిస్తూ
ఉన్నతంగా ఎదిగిన
సూర్యుడిశక్తికి మాడిమసయ్‌
ఆనవాలులేని మనిషితనమే
నిర్మించడమెంతకష్టమో
తగలెట్టినట్లైతే కాదుగా

యుద్ధం నేర్పేదేమి
కరుకుగుండెలన్నొక్కటై
కసిగా కసికసిగా దొంగలా
మనిషిని తునాతునకల్జేయడమే
మాంసం ముద్దలన్ని ఘోషిస్తుంటే
రాక్షసగీతమాలపించడమే
అంతయ్యాక
దయ్యాలు వేదాల్జెప్పిన్నట్టు
ఆధిపత్యగీతమాలపిస్తరు
శవాల లెక్కలు చరిత్రలో లిఖిస్తారు

అణువంతైన బయమేలేదే
అణుబాంబులంటే
ఆటలాడంకుంటున్నరు
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న నేటినాటుమనిషి
అమ్మలాంటి అవనినంతా
అతలాకుతలంజేస్తూ నాశనంవైపడుగులేస్తున్నడు

యుద్దమంటే
అక్కడ శాంతి చిహ్నాలన్నీ
మంటలలో తగబడుతూ
బూడిదలా మారడమేనేమో

క్షితిమంటల్లో
నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ
మరణాన్ని రుచిచూడడమే
ఎంజరుగుతుందో తెలియని
అయేమయంలో తనువును వదిలేయడమే

శాస్త్రవేత్తలు సాధించిన
విజ్ఞానం
నేడు వినాశనానికి నాందైంది
సాంకేతికత నాగరికతకు
సమాధికడుతూ
ప్రకృతినంతా కృత్రిమత్వంతో అలంకరిస్తున్నరు

తిరుగుతున్న నేలనంతా అణుబాంబులతో అలుకుతున్నరు
గ్యారంటీ మాటేమోగాని
వారంటీలేని జీవితాలు
కాలుష్యభూతమొకవైపు
చాపకిందనీరై చావుమేళం మోగిస్తోంది

బెదిరించడంమాని
బ్రతికించడం మదినింపుకో
కూల్చడంమాని
నిర్మించడం నేర్చుకో
యుద్దమెపుడు భయానకస్వస్నం
శాంతికోసం అడుగులేద్దాం
విశ్వశాంతితోనే మనిషికి మనుగడ

– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు, 9010480557.

Leave a Reply