నీవు నవ్వుతూ ఈ నేలపై పోతుంటే

నీ నవ్వులన్నీ పువ్వులై పూస్తాయి ప్రియా…
నీవట్లా ఆకాశానికి భూమికి మధ్య తేలిపోతావుంటే
నీ నవ్వులన్నీ ఈ నేలపై చినుకులై కురుస్తాయి సఖీ…
నీవట్లా అమావాస్య రాతిరి ఆకాశం నుండి నవ్వుతుంటే
నీ నవ్వులన్నీ చుక్కలై మెరుస్తున్నవి చెలీ….
చెలీ…సఖీ…ప్రియా…
నీ నవ్వులన్నీ
పూలై పూసిన
చినుకులలై రాలిన
చుక్కలై మెరిసిన
చూస్తూ ఆస్వాదించడమే
నాకున్న అర్హత..యోగ్యత
– దిలీప్‌.‌వి,  మల్లంపల్లి, ములుగు జిల్లా
8464030808

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *