Take a fresh look at your lifestyle.

నివాసయోగ్యం కాని చోట ఇళ్ల స్థలాలు

ప్రత్తిపాడులో మహిళా లబ్దిదారుల నిరసన
రాజమండ్రి,జూలై 3 : తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన స్థలాల్లో మహిళలు నిరసనకు దిగారు. గ్రామానికి దూరంగా కొండల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నివాస యోగ్యంగా లేని స్థలాల్లో ఎలా ఇళ్లు కట్టుకుంటామని వారు నిలదీసారు. ఈ అంశంపై స్థానిక నాయకులను మహిళలు నిలదీశారు. కాగా తహసీల్దార్‌ ఈ ‌స్థలాన్‌ఇన ఎంపిక చేశారంటూ నేతలు సమాధానమిచ్చారు. స్థానిక నాయకులు, అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నివాస యోగ్యంగా ఉన్న చోట ఇళ్లు కట్టించి ఇవ్వాలని వారు కోరారు. ఇదిలావుంటే జిల్లాలో ఇళ్ల పథకం కింద తొలి దశలో 1,48 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసే క్రమంలో తొలి రోజున పెద్ద ఎత్తున శంకుస్థాపనలు జరిగాయని, మిగిలిన రెండు రోజుల్లో 40వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్‌ ‌డి.మురళీధర్‌రెడ్డి అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పథకం అమల్లో జిల్లాను ముందు వరసలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.

రూ.1,.80 లక్షల యూనిట్‌ ‌వ్యయంతో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి ఎస్‌హెచజీ లింకేజీ ద్వారా రూ.50 వేల అడ్వాన్సు రుణం అందించడంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్థిక వనరులపరంగా లబ్దిదారులకు మద్దతుగా నిలిచేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యా మ్నాయ మార్గాలపైనా దృష్టిసారించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని జాయింట్‌ ‌కలెక్టర్‌ (‌హౌసింగ్‌) ‌భార్గవ్‌ ‌తేజకు సూచించారు. పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మెగా గ్రౌండింగ్‌ ‌మేళా కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా పరిషత్‌ ‌సీఈవో సత్యనారాయణ పేర్కొన్నారు. జగనన్న కాలనీలుగా తొలి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో గృహ నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు జరిపించాలన్నారు.

Leave a Reply