Take a fresh look at your lifestyle.

కొత్తబట్టలు కొనివ్వలేదని తల్లి తండ్రులు మీద కోపంతో ఆత్మహత్య చేసుకున్న మైనర్‌ ‌బాలిక

కొమురం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లాలో ఘటన
కాగజ్‌నగర్‌, ఆగష్టు 5, (ప్రజాతంత్ర విలేకరి) : ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మైనర్‌ ‌లు తల్లిదండ్రులపై అలిగి ఎంతో భవిష్యత్‌ ఉన్న తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. స్మార్ట్ ‌ఫోన్‌ ఇవ్వలేదనో..లేక కొత్త ఫోన్‌ ‌కొనివ్వలేదనో లేక కొత్త బట్టలు కొనివ్వలేదనో ఇలా చిన్న చిన్న కార్యక్రమాలకు అలిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కొమురం భీం అసిఫాబాద్‌ ‌జిల్లాలోని అప్పపల్లి గ్రామంలో ఒకటి చోటు చేసుకుంది. తమ తల్లిదండ్రులు కొత్త బట్టలు కొనివ్వలేదని 15ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. అసిఫాబాద్‌ ‌మండలం అప్పపల్లి గ్రామానికి చెందిన శిరీష 15 ఏళ్ల పదవ తరగతి చదువుతున్నా బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కోత్త బట్టలు కొనివ్వు అమ్మని శిరీష బాలిక అడిగింది .తల్లి లేదు బిడ్డ ఈరోజు వద్దు రేపు తీసుకుందాం అని తల్లి చెప్పడంతో శిరీష లేదు ఈ రోజే కావాలి అని పట్టుపట్టింది.దింతో శిరీష తమ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. కొత్తబట్టలు కొనివ్వలేదని మనస్థాపానికి గురైన బాలిక అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply