Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తరకం వైరస్‌ ‌లేదు ..: కేంద్ర కార్యదర్శి

  • ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దన్న జవహర్‌ ‌రెడ్డి
  • అలాంటిది ఉంటే ఇప్పటికే కేంద్రం గుర్తించేదని వివరణ

ఆం‌ధప్రదేశ్‌లో కొత్త రకం కొరోనా వైరస్‌ ఎన్‌ 440ఐ ‌వేరియెంట్‌ ‌ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్‌ ఇప్పు‌డు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీలో కొత్త రకం వైరస్‌ ‌లేదని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్‌ ‌స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా గుర్తించిన బి167 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదన్నారు. ఈ మధ్యకాలంలో బి 618 రకం కనుగొన్నప్పటికీ అది త్వరగా కనుమరుగైందని రేణూస్వరూప్‌ ‌పేర్కొన్నారు. ఎన్‌ 440‌కే వైరస్‌ ‌ప్రభావం దేశంలో ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశామని.. దేశంలో బి167 వైరస్‌ ‌ప్రభావమే ఉందని కేంద్ర బయోటెక్నాలజీశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై ఏపీ స్టేట్‌ ‌కోవిడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌చైర్మన్‌ ‌కేఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి మీడియా మీట్‌ ‌నిర్వహించి వివరణ ఇచ్చారు. గత ఏడాది జూన్‌, ‌జులైలో ఈ స్టెయ్రిన్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నమూనాలు నుంచి సీసీఎంబీ గుర్తించిందని తెలిపారు.

ఏపీ లో 2021 ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గింది. ఇప్పుడు ఈ రకం వైరస్‌ను చాలా తక్కువగా గుర్తిస్తున్నాం. ప్రస్తుతం సౌత్‌ ఇం‌డియా నమూనాలు నుంచి బి.1.617,బి1 గుర్తించాం. ఏప్రిల్‌ ‌నెల డేటా ఆధారంగా దీన్ని గుర్తించాం. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని గ్రహించాం. యువకుల్లో సైతం దీని వ్యాప్తి అధికం ఉంటుందని గుర్తించాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్‌ ఆఫ్‌ ఇం‌టరెస్ట్‌గా ప్రకటించింది. అయితే ఎన్‌440‌కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని జవహర్‌ ‌రెడ్డి మిడియా ముఖంగా వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్దని జవహర్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్‌440‌కే వైరస్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ ‌తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమిలేదని ఆయన వెల్లడించారు.

ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల నుండి నమూనాలను జన్యు శ్రేణి పరీక్షల కోసం సీసీఎంబీ హైదరాబాద్‌కి పంపిస్తున్నారు. ఎన్‌ 440‌కె (బి.1.36) వైరస్‌ ‌దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. 2020 జున్‌, ‌జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. దాని ప్రభావం గత డిసెంబర్‌, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించింది. కానీ మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైంది, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పం అన్నారు. ఇది అధిక ఇన్ఫెక్షన్‌ ‌కారకంగాను, యువతలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపీడేమియోలాజికల్‌లో కూడా బి.1.617ని ఇండియాలో గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్‌ 440‌కే వేరియంట్‌ ‌కోసం డబ్ల్యూహెచ్‌వో ఎక్కడా ప్రస్తావించలేదని జవహర్‌రెడ్డి వివరించారు. దీని ప్రభావం ఉంటే ఐసీఎంఆర్‌, ‌డబ్ల్యూహెచ్‌వో గుర్తించకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

మిడియాలో శాస్త్రీయమైన అంశాలపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని కేఎస్‌ ‌జవహర్‌రెడ్డి అన్నారు. ఇదిలావుంటే కరోనా వైరస్‌ ‌కంటే టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు శక్తికి మించి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందని ప్రశంసించారు. చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కొత్త వైరస్‌ ఉం‌దని అబాండాలు వేస్తున్నారని, ఎన్‌440‌కే వైరస్‌పై ఎలాంటి నిర్దారణ జరగలేదని స్పష్టం చేశారు. కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, ‌బెడ్స్, ‌రెమిడివిసిర్‌ అన్నీ అందుబాటులో ఉంచామని తెలిపారు.

Leave a Reply