వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: జిల్లా అధికారులందరూ వారానికి నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి పర్యటనలు, అటెండెన్స్ యాప్ హాజరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ ప్రతివారం నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు. క్రింది స్థాయి అధికారులు పనిచేసే విధంగా చర్యలు చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తగిన చర్యలు చేపట్టాలని, అప్పుడే పనులలో పురోగతి సాధించగలుగుతామని అన్నారు. ప్రతి శాఖలో సమయపాలన పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించే విధంగా అటెండెన్స్ యాప్ ను పక్కాగా అమలు చేయాలన్నారు. అటెండెన్స్ యాప్ ద్వారా ఉద్యోగి హాజరును పరిగణించడం జరుగుతుందని, దీని ఆధారంగానే జీతాలు చెల్లించాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు చేపట్టాలని, ఇక నుండి అటెండెన్స్ యాప్ ను సమీక్షించడం జరుగుతుందన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి



