భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి ప్రయోగం సందర్భంగా ఆయన స్వామిని దర్శించుకుని ప్రయోగం విజయంవంతం కావాలని కోరుకున్నారు. తొలిసారి ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే.
పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా ఈ నెల 28 ఉదయం షార్ నుంచి రోదసిలోకి ఉపగ్రహాలను పంపనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, ఎంపీ మార్గాని భరత్ తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.