Take a fresh look at your lifestyle.

₹30కోట్ల తో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులు

శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట నియోజకవర్గంలో చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామం నుండి సిద్దిపేట మున్సిపాలిటీ ఇమామ్ బాద్ వరకు నిర్మించే పోర్ లైన్ రోడ్డు కు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు…ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. 30కోట్ల తో రామంచ గ్రామం నుండి ఇమాం బాద్ వరకు 6 కిమి ఉన్న రెండు వరసల రహదారి ని నాలుగు వరుసల రహదారి గా మారుస్తున్నాం అన్నారు.. ఈ రహదారి సెంటర్ లైటింగ్ ,
పట్టణంలో ఏవిధంగా అయితే మధ్యలో డివైడర్ , చెట్లు ఉన్నాయో అదే మాదిరిగా ఈ రహదారి అద్భుతంగా, సుందరంగా నిర్మిస్తామన్నారు..వాహన చోదకులకు ప్రమాదాలు జరగకుండా అన్ని రేడియం.. స్టడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.. పట్టణంలో ప్రజా అవసరాల దృష్ట్యా ,పెరిగిన జనాభా దృష్టిలో పెట్టుకొని సిద్దిపేట నలు దిక్కుల్లో రహదారులను అభివృద్ధి చేస్తుమన్నారు..ఇప్పటికే పనులు ప్రారంభం కాగా వచ్చే 6నెలల్లో పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు..

ఈ నెలలో పెన్షన్లు.. రైతు బంధు పెట్టు బడి సహాయం…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పెంచిన పెన్షన్ లు ఈ జూన్ నెలలో అందిస్తామని..అదే విదంగా రైతులకు వచ్చే వానకాలం
పెట్టు బడి సహాయం పంటకు 5వేలు చొప్పున..రెండు పంటలకు 10వేలు ఈ నెలలో రైతుల ఖాతాల్లో పడతాయని అన్నారు.. ప్రభుత్వం నిరుద్యోగులకు కొద్దీ రోజులో 3వేళా రూపాయలు నిరుద్యోగు భృతి ఇవ్వనున్నట్లు చెప్పారు.. ఈ ప్రాంతంలోనే నిండు కుండాల ఉండే రంగనాయక సాగర్ నిర్మిస్తున్నామని..రంగనాయక సాగర్ కాలువలతో ప్రతి చెరువు, కుంటా నింపుతామన్నారు… రామంచ గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు… ఒక వైపు రంగనాయక సాగర్..మారో వైపు నాలుగు వరుసల రహదారి తో ఈ గ్రామం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందనీ హరీష్ రావు అన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy