Take a fresh look at your lifestyle.

‌సంపద రాశులు ఒక వైపు.. ఆకలి కేకలు వేరొక వైపు..

ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ‌ముందు వరుసలో ఉందని నాయకులు గర్వంగా చెప్పుకుంటున్నారూ.ఇన్ని ఉన్నా కూడా నాయకుల మాటలు కానీచేతలు కానీ జానెడు కడుపు ఆకలిని నింపలేకపోతున్నాయి. చాలా వాటిలో ఉత్తమ ర్యాంక్‌ ‌లు సాధిస్తున్న మన దేశంలో పోషకాహారం లేక విలవిలలాడే వారు సంఖ్య పరిశీలిస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.సంపద రాశులు ఒక వైపు.. ఆకలి కేకలు మరొక వైపు..దేశం సాధిస్తున్నవృద్ధి రేటు మాత్రం అభాగ్యుల కడుపు నింపలేని పరిస్ధితి వేరొక వైపు.ఫలితంగామన నేల ఆకలి మంటలకు నిలయంగా మారింది.

ప్రపంచ కుబేరుల అగ్ర స్థానానికి మన దేశ కుబేరులు పోటీ పడుతున్నారు… సాంకేతికలో కూడా మన దేశం పరుగులు పెడుతూ ఉంది ..నవకల్పనలలో కూడా మనం తక్కువేం కాదు..సెన్సెస్‌ ‌పరుగులు పెడుతూ ఉంది.మరొక పక్కఅభివృద్ధి పథంలో అగ్రరాజ్యాల చెంతకు భారత్‌ ‌చేరుకునే సమయం దగ్గరలోనే ఉందని మన నేతల ప్రసంగాలు కోటలు దాటుతున్నాయి. ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ‌ముందు వరుసలో ఉందని నాయకులు గర్వంగా చెప్పుకుంటున్నారూ.ఇన్ని ఉన్నా కూడా నాయకుల మాటలు కానీచేతలు కానీ జానెడు కడుపు ఆకలిని నింపలేకపోతున్నాయి. చాలా వాటిలో ఉత్తమ ర్యాంక్‌ ‌లు సాధిస్తున్న మన దేశంలో పోషకాహారం లేక విలవిలలాడే వారు సంఖ్య పరిశీలిస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.సంపద రాశులు ఒక వైపు.. ఆకలి కేకలు మరొక వైపు..దేశం సాధిస్తున్నవృద్ధి రేటు మాత్రం అభాగ్యుల కడుపు నింపలేని పరిస్ధితి వేరొక వైపు.ఫలితంగామన నేల ఆకలి మంటలకు నిలయంగా మారింది.తాజాగా ప్రపంచ ఆకలి సూచీ 2021 నివేదిక ప్రకారం116 దేశాల జాబితాతో వెలువడిన ప్రపంచ ఆకలి సూచీలో (global hunger index 2021) భారత్‌ 101‌వ స్థానంలో ఉంది.మన పొరుగు దేశాలైన పాకిస్తాన్‌ (92), ‌నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌ (76)‌లకు ఉత్తమ ర్యాంక్‌లు దక్కించుకున్నాయి.

చైనా, కువైట్‌, ‌బ్రెజిల్‌ ‌తదితర 18 దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నట్టు ప్రపంచ ఆకలి సూచీ వెబ్‌సైట్‌ ‌వెల్లడించింది ప్రధానంగా గత ఏడాది కంటే ఈ ఏడాది భారత్‌ ఈ ‌సూచీలో మరింత దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మొత్తం 107 దేశాలకుగాను భారత్‌కు 94వ ర్యాంక్‌ ‌లభించగా నేడు 101 కి క్షీణించడం జరిగింది. పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోడం, చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, చిన్నారుల మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఐరిష్‌కు చెందిన వరల్డ్‌వైడ్‌, ‌జర్మనీకి చెందిన వెల్ట్ ‌హంగర్‌ ‌హిల్ఫే సంయుక్తంగా ఈ సూచీని రూపొందించాయి. ఈ నివేదిక ప్రకారం భారత్‌ ఆకలి సూచి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని తెలుస్తూ ఉంది.ఈ సూచీలో ఆర్థికంగా, సామాజికంగా కాస్త మనకన్నా వెనుకబడిన దేశాలు మనకన్నా మెరుగైన స్థానంలో నిలిచాయి.

100 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయనే అంశంతో దీనికి ర్యాంక్‌ ‌కేటాయిస్తారు. 0 స్కోరు వస్తే ఆకలి లేదని అర్థం. 100 పాయింట్లు వస్తే ఆకలి సమస్య తీవ్రంగా ఉందనిఅర్థం. తీవ్రత ఆధారంగా ప్రతి దేశాన్ని తక్కువ నుంచి అత్యంత ఆందోళనకరం మధ్య వర్గీకరిస్తారు. ఈ ఏడాది జాబితా ప్రకారం సోమాలియా అత్యంత ఆందోళనకరం విభాగంలో ఉంది.ఈ జాబితా ప్రధాన లక్ష్యం 2030 నాటికి జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో ఆకలి బాధలు లేని సమాజం (జీరో హంగర్‌) ‌నెలకొల్పడం. ఆ దిశగా దాని పురోగతిని కొలవడానికి కీలక అంశాలను ఈ సూచిక ద్వారా గుర్తించడం జరుగుతుంది..తాజాగా ప్రకటించిన ఆకలి సూచీలను బట్టి 2030 నాటికి ఈ జాబితాలోని 47 దేశాలు ఆకలి లేని సమాజాన్ని సాధించడంలో వెనుకబడతాయని అంచనా వేశారు.ఈ సూచీలో మన ర్యాంక్‌ 101 ‌గా ఉంది అంటే మనకన్నా మెరుగైన స్ధితిలో 100 దేశాలు ఉన్నాయి. గతేడాది ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాల జాబితాలో మన దేశం 94వ స్థానంలో నిలిచింది.అంటే ఆకలి బాధ నివారణలో గత ఏడాది 93 దేశాలు మనకన్నా అగ్రభాగాన ఉంటే.. ఈ ఏడాది అటువంటి దేశాల సంఖ్య 100కి పెరిగింది. దీనిని బట్టి ఆకలి నివారణలో మన స్ధానం ఏమిటో తెలుస్తూ ఉంది. భారతదేశంలో పేదలు ఉన్నారు కానీ పేద దేశం కాదు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఇలా ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ దేశంలో ఆకలితో అలమటించేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు.

దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతూ ఉన్నారు అనేది వాస్తవం.వాటిలో ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లల పౌష్టికాహార కార్యక్రమాలు రెండింటిని మన దేశం అమలు చేస్తుంది.అయినా ఆకలి సమస్యను పరిష్కరించడంలో విజయవంతం కాలే కపోతున్నాం. ఆరేళ్లలోపు పిల్లలకు ఐ.సీ.డీ.ఎస్‌ Integrated Child Development Sevices)) కార్యక్రమం, 14 ఏళ్ల వయసు వరకు పాఠశాలలకు హాజరవుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే ఇవన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వక పోవడం వల్లనే ఈ పరిస్ధితి ఏర్పడింది అని ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్- ‌జీహెచ్‌ఐ) 2021 ‌స్పష్టం చేసింది. మరొక పక్క దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ ఆకలి బాధ, పోషకాహార లోపాలు వంటివి చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలోని చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువులేని వారి శాతం 1998-2002 మధ్య 17.1గా ఉండగా.. 2016-2020 మధ్య ఈ సంఖ్య 17.3కి పెరిగిందని ఈ నివేదిక తెలిపింది.

అయితే ఈ నివేదిక ప్రకారం ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు మాత్రం మన దేశంలో తగ్గుముఖం పట్టడం అనేది ఒక శుభపరిణామంగానే చెప్పవచ్చును.. సరిపడా ఆహారం లభించడం కారణంగా పోషకా హార లోపం వంటి ఇతర సూచికలలో కూడా గతం కన్నా కొంత మెరుగుదల మనదేశంలో కనిపించిందని ఈ సూచిక తెలియచేసింది.అయితేగ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్ ‌నివేదికపై కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మాత్రం ఘాటుగా స్పందించింది. ఈ నివేదికలో భారత దేశ ర్యాంకును తగ్గించడం దిగ్భ్రాంతికరమని ప్రధానంగా దీనికిఅనుసరించిన విధానం అశాస్త్రీయమైనదని తెలిపింది. నాలుగు ప్రశ్నల ఒపీనియన్‌ ‌పోల్‌ ఆధారంగా ఈ అంచనా వేసి ఫలితాలు తెలపడంలో హేతుబద్ధత ఉండదని అభిప్రాయ పడింది. టెలిఫోన్‌ ‌ద్వారా గాలప్‌ ‌నిర్వహించిండం సక్రమ ఫలితాలు ఇవ్వజాలదని తెలిపింది. తలసరి ఆహార ధాన్యాల లభ్యత వంటి వాటిని తెలుసుకుని పోషకాహార లోపాన్ని లెక్కించడానికి శాస్త్రీయ విధానం అంటూ ఏదీ లేదని కూడా పేర్కొంది. పోషకాహార లోపాన్ని శాస్త్రీయంగా లెక్కించాలంటే బరువు, ఎత్తు గణాంకాలు అవసరమని తెలిపింది.దీనికి భిన్నంగా ఈ సర్వే జరపడం సమంజసం కాదు అని ఖండించింది.

గాలప్‌ ‌పోల్‌ ‌విధానం ఆధారంగా నిర్వహించే సర్వేలు నమ్మశక్యం కాదని ఈ విషయంలో చాలా దేశాలకు అభ్యంతరాలు ఉన్నాయని కూడా పేర్కొంది.కోవిడ్‌-19 ‌మహమ్మారి సమయంలో యావత్తు జనాభాకు ప్రభుత్వం ఆహార భద్రత కల్పించిన విషయాన్ని ఈ నివేదిక పట్టించుకోలేదని పేర్కొంది.ఇటువంటివి పరిగణలోనికి తీసుకోకుండా చేపట్టే సర్వేలు ఏ విధంగా వాస్తవికతను ప్రతిబింబిస్తాయి అనేది ప్రభుత్వ అభ్యంతరం..అయితే గత సంవత్సరం వచ్చిన ర్యాంక్‌ ‌కు ఇప్పటి ర్యాంక్‌ ‌కు దాదాపు దగ్గరగానే ఉంది.. దానితో పోల్చి చూస్తే ఎంత ఆహార భద్రత కార్యక్రమాలు చేపట్టిన 50 రాంక్‌ ‌సాదించలేము కదా..ఇచ్చిన ర్యాంక్‌ ‌పై అభ్యంతరాలు పై సమయం వెచ్చించడం కన్నా ఎన్నో కోట్లాది రూపాయలు వెచ్చించి పథకాలు అమలు చేస్తూ ఉన్నా కూడా లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేక పోతున్నాం అనే దానిపై దృష్టి పెడితే ఖచ్చితంగా సత్ఫలితాలు సాదించగలుగుతాం..ఈ నివేదిక కూడా భారత్‌ ‌పోషకాహారం అందించేందుకు భారీ పధకాలు అమలు చేస్తూ ఉన్నా క్షేత్ర స్ధాయిలో ఫలితాలు సాదించలేక పోవడానికి నిధుల కొరత కాదు నిర్వహణ లోపంగా చెప్ప వచ్చు..

ముఖ్యంగాపేదరికం, ఆకలి విషవలయాలను నిర్మూలించడానికి సామాజిక భద్రతా పథకాల విస్తృత అమలుపై దృష్టి సారించాలి. అలాగే విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతిపై ప్రభుత్వరంగ పెట్టుబడులు పెంచాలి. ముఖ్యంగా పర్యవేక్షణ కొరవడటం, పోషకాహార లోపాలను సరిదిద్ద లేకపోవటం వంటివి మన దేశం వెనుకబాటుకు కారణాలుగా ఉన్నాయని నివేదికలో ప్రత్యేకంగా విశ్లేషించారు. ఇవన్నీ చిత్త శుద్దితో అమలు పరిచిన నాడు మనం ఆశించిన ఫలితాలు సాదించగలుగుతాం ఆకలి సూచీలో తప్పక పురోగతి సాధిస్తాం.అంతవరకూ అభివృద్ధి అంకెల్లో కనిపిస్తుంది. అభివృద్ధి ఫలాలు సమాజంలో భాగ్యవంతుల చెంతకే చేరి సమాజంలో అసమానతలు మరింత బలం పుంజుకుంటాయి తప్ప ఆకలి కేకలు మాత్రం అరికట్టలేం..ఇదే వరవడి కొనసాగుతూ ఉన్నంత కాలం సూచీలో 100 కు అటూ ర్యాంక్‌ ఉం‌టుంది తప్ప అద్భుతాలు మాత్రం సాదించుకోలేం అనేది మాత్రం స్పష్టం.

– రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578
లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్..ఐ.‌పోలవరం.

Leave a Reply