- ఎపిలో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్
- ఒకే గొడుగు కిందకు ఇక్క అన్ని దేవాలయాలు
- ప్రారంభించిన సిఎం వైఎస్ జగన్
టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంలోకి దేవాదాయశాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాలు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్గ్రొల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్‌బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్ మేనేజ్ మెంట్ వ్యవస్థలో ఉంటాయని అన్నారు. భక్తులు ఇ?హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం కూడా కల్పిస్తున్నామని అన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఇ- హుండీకి కానుకలు సమర్పించే అవకాశం ఇస్తున్నామని అన్నారు.
ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించ నున్నట్టు చెబుతున్నారు. తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ మొదలు పెడతామని ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ ప్రవేశ పెడతామని అన్నారు. ఇక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అన్నవరం టెంపుల్‌కు 10,116లు ఇ?హుండీ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సమర్పించారు. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని, దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని జగన్ పేర్కొన్నారు.