Take a fresh look at your lifestyle.

సేవ్‌ ‌వైజాగ్‌ ‌ప్లాంట్‌ అం‌టూ వోటు

‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ఉద్యోగులు జీవీఎంసీ ఎన్నికల్లో వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ’సేవ్‌ ‌వైజాగ్‌ ‌స్టీల్‌ప్లాంట్‌’ అని రాసిన స్లిప్పులు ఓటుతోపాటు వేసారు. 68వ వార్డులో ఓటుతో జతచేసి వేశారు. ప్రజలంతా వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటు పరం కాకుండా కాపాడేందుకు సేవ్‌ ‌వైజాగ్‌ ‌స్టీల్‌ ప్లాంట్‌ ‌స్లిప్‌ను జత చేయాలని ఉద్యోగులు, నిర్వాసితులు కోరుతున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సుమారు 27 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఉద్యోగులు, కార్మికుల ఆవేదన, బాధను కేంద్రం పట్టించుకోలేదన్నారు. అందుకే తాము ఓటు హక్కుద్వారా తమ నినాదం తెలియజేస్తున్నామని చెప్పారు. సేవ్‌ ‌స్టీల్‌ ప్లాంట్‌ అనే స్లిప్‌ను కూడా వేస్తున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్రం తమ ఆవేదనను అర్థం చేసుకుని ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

Leave a Reply