Take a fresh look at your lifestyle.

‌ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు

  • 49.25 శాతం ఓటింగ్‌ ‌నమోదు
  • 16వ డివిజన్‌లో కార్యకర్తల మధ్య ఘర్షణ – పోలీసులు లాఠీఛార్జి
  • చెదురుమదురు సంఘటనలు మధ్య ముగిసిన వరంగల్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలు

వరంగల్‌, ఏ‌ప్రిల్‌ 30, (‌ప్రజాతంత్ర ప్రతినిధి) : గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. ఈ ఎన్నికలలో వరంగల్‌ ‌కార్పొరేషన్‌కు 66 డివిజన్లు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిపోటీని ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ 10 ‌గంటల వరకు ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌ ‌కేంద్రాలకు రాకపోవడం వల్ల ఓటింగ్‌ ‌శాతం ఏవిధంగా ఉంటదని ముందుగా అధికారులు పెద్దగా అంచనా వేయలేకపోయారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద టెంట్లు వేసి వైరస్‌ ‌నియంత్రణకు నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల మధ్య అన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. అధికార పార్టీ డబ్బులు పంచుతుందని బిజెపి ఆరోపించారు.  వరంగల్‌ ‌గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలకు 49% ఓటింగ్‌ ‌నమోదైనట్టు అధికార వర్గాలు అధికారికంగా ధృవీకరించారు.

అయితే గతంతో పోలిస్తే ఎన్నికలలో పోలింగ్‌ ‌శాతం తగ్గినట్లు పరిశీలకులు అంటున్నారు. విలీన గ్రామాలలో పెరిగిన ఓటింగ్‌ ‌శాతం గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో విలీన గ్రామాలలో ప్రాంతంలో పోలింగ్‌ ‌శాతం ఎక్కువగా నమోదైనట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉదయం నుండే పెద్ద ఎత్తున పోలింగ్‌ ‌కేంద్రాల వద్దకు ప్రజలు బారులు తీరారు. అయితే నగరంలోని ప్రజలు మాత్రం పెద్ద ఓటింగ్‌ ‌శాతంపై ఆసక్తి చూపలేదని, అసలే వైరస్‌ ‌కారణంగా దృష్ట్యా ఓటింగ్‌ ‌శాతం తక్కువగా నమోదైనట్టు ఎన్నికల పరిశీలకులు ముఖ్యంగా వైరస్‌ ‌బాగా ఉండటం వల్ల ఎందుకొచ్చిన తంటా అని ఓటర్లు ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం జరిగిందని పరిశీలకులు అంటున్నారు. కేవలం డబ్బులు తీసుకున్న వారు కొంతమంది మాత్రం ఓటింగ్‌లో పాల్గొన్నారని. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ 66 ‌డివిజన్లకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఓటింగ్‌లో 10 గంటల వరకు పెద్దగా ఓటింగ్‌ ‌కోసం జనం బయటికి రాక పోవడం వల్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు మొదట ఆందోళనకు గురయ్యారు. అసలు ఓటింగ్‌కు జనం వస్తారా రారా ఆందోళనలో మొదట వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ఇప్పటికే రాత్రికి రాత్రి వివిధ రాజకీయ పార్టీల నాయకులు డబ్బులు పంచినట్లు అధికార పక్ష పార్టీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున, కాంగ్రెస్‌ ‌పార్టీ రూ.500ల చొప్పున బిజెపి పార్టీ కూడా రూ.500 ఓటుకు ఇచ్చినట్లు ప్రజలు అంటున్నారు.

ఇంతే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయాలని ప్రజలు భావించినట్లు పలువురి ఆలోచనలు బట్టి తెలుస్తుంది. ఓటింగ్‌లో పాల్గొన్న వారందరూ రాజకీయ పార్టీల  ప్రలోభాలకు లోనైనట్లు చాలా మంది ఓటర్లు అంటున్నారు. ఎన్నికల పరిశీలకులు, పోలీసు యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బులే  ప్రధానమైన ఆయుధంగా వివిధ రాజకీయ పార్టీలు చేపట్టారు. 10 గంటల వరకు కేవలం 10 శాతం మాత్రమే ఓటింగుకు హాజరైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో 66 డివిజన్లు గాను జరిగిన ఎన్నికలలో చెదురుమదురు సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ఎన్నికల కమిషన్‌ ‌కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా యంత్రాంగం పేర్కొంది. పోలింగ్‌ ‌కేంద్రాలను జిల్లా కలెక్టర్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌ప్రతి గంటకు ఒక సారి పర్యవేక్షించడం జరిగింది. పోలింగ్‌కు హాజరయ్యే ప్రజలకు మాస్కులు తప్పకుండా వాడాలని సూచించారు. పూర్తిగా కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ ప్రజలను ఓటింగ్‌కు హాజరయ్యే విధంగా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలలో మధ్యాహ్నం 1:00 వరకు 37.98% పోలింగ్‌ ‌నమోదయింది. వరంగల్‌ 16 ‌వ డివిజన్‌లో కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే లాఠీఛార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలైన్లో నిలబడి వారందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఎన్నికల నిర్వహణ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply