Take a fresh look at your lifestyle.

‌ప్రణబ్‌ ‌ముఖర్జీ శిఖర సమాన నేత… ఆయన మృతి దేశానికి తీరని లోటు

ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట

రాష్ట్ర శాసనసభ, మండలిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో సీఎం కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టిన ఈ రెండు సంతాప తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించి.. నివాళులర్పించారు. మాజీ సభ్యులు కావేటి సమ్మయ్య, జువ్వాడి రత్నాకర్‌ ‌రావు, పోచయ్య, పి రామస్వామి, మస్కు నర్సింహ, బి కృష్ణ, సున్నం రాజయ్య, ఎడ్మ కిష్టారెడ్డి, మాతంగి నర్సయ్య మృతి పట్ల సభ నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రకటించారు. మండలిలో ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రణబ్‌ ‌సంతాప తీర్మానాన్ని •ంమత్రి మహ్మద్‌ అలీ ప్రవేశ పెట్టారు. ఆయన గొప్పతనాన్ని ప్రస్తావించారు.

మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ‌సబితా ఇంద్రారెడ్డి, చీఫ్‌విప్‌ ‌బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌ ‌పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. ప్రణబ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్‌ ‌చూపిన చొరవను స్మరించుకున్నారు. కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ ‌నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కొరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకుని, నెగెటివ్‌ ‌వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సహా పటువురు నాయకుల మృతి పట్ల వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

కొవిడ్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో సభ్యులతో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధరించారు. కరోనా నేపథ్యంలో ఉభయ సభల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగిటివ్‌ ‌వచ్చిన వారినే లోపలికి అనుమతించారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్చొనేలా.. అదనంగా అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, డియా ప్రతినిధులు, పోలీసులకు కరోనా టెస్టులు చేశారు. అసెంబ్లీ ఆవరణలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్‌ ‌యంత్రాలు, ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో మాస్కు ధరించని వారి వివరాలు, వారి ఉష్ణోగ్రతలు ఎప్పుటికప్పుడు తెలుస్తాయి. అసెంబ్లీకి వచ్చే ఫైల్స్‌ను శానిటైజ్‌ ‌చేసేందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చారు. సందర్శకులను, ఎమ్మెల్యేల పీఏలను అనుమతించలేదు. డియాను పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మంత్రుల పేషీ నుంచి ఒక పీఏ, ఒక పీఎస్‌నే మాత్రమే అనుమతించారు.

కొరోనా నిబంధనల మేరకు ఏర్పాట్లు…పోలీసుల భారీ బందోబస్తు
అసెంబ్లీ సమావేశాలకు పోలీసు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నేటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలకి ఆరు వందల మంది పోలీసులతో నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ‌భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు శాసన మండలి పరిసర ప్రాంతాల్లో మూడంచెల పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు విధులు నిర్వహించే 650 మంది పోలీసులకు ముందుగానే కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో ముగ్గురికి పాజిటివ్‌ ‌రావడంతో వారిని ఐసోలేషన్‌ ‌పంపిచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేశారు.

Leave a Reply