Take a fresh look at your lifestyle.

‌ప్రకృతమ్మా….

తూరుపున సూరీడు కిందకి ఒగ్గి
సెరువమ్మ కడుపున ముద్దాడితే…
పడమరణ సూరీడు నిదురోయే ఆల్లకు
కలువలను కనిచ్చింది.

సంధేళకు నిదురలేసిన చంద్రమ్మ
చెలికాడి చెలిమ గురుతుల చూసి
ఆనందంతో ఎగిరి గంతేసింది
తెల్లరేసరికళ్లా…
సెరువమ్మ కడుపునంత
అందంగా పూసేలా చేసి మురిసింది.

జీవంలేని వెదురు గొంతులో
ఊపిరులు ఊదితే…
కమ్మని స్వరాలకు పురుడుపోసింది.

తన బిడ్డ సంతానాన్ని
మోసుకెళ్లిన అడవమ్మా
పశు పక్షాదులతో ఆడి పాడి
ప్రకృతినంత పరవశింప చేసింది.
– దిలీప్‌.‌వి, మల్లంపల్లి,ములుగు
సెల్‌:8464030808

Leave a Reply