Take a fresh look at your lifestyle.

‌హక్కులకై కలెబడి, బాధ్యతలకై నిలబడ్డ సారయ్య సార్‌ .

సంసద్‌ ‌యాత్రలో భాగంగా డిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌లో రెండో రోజు ధర్నా ముగిసిన అనంతరం పార్లమెంట్‌ ‌వైపుగా వెళ్ళిన ఉద్యమకారులు అందులోకి చొచ్చుకువెళ్ళడానికి పోలీసులతో పోటీపడుతున్నప్పుడు జరిగిన అరెస్ట్‌లో ఎ1 నుండి ఎ5 వరకు 5గురు భీమదేవరపల్లి జె.ఏ.సి కార్యకర్తలున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ జె.ఏ.సి బలాన్ని! తెలంగాణ ఉద్యమంలో భాగంగా కరీంనగర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంపై దాడి చేసింది భీమదేవరపల్లి మిలిటెంట్‌ ఉద్యమకారులే! అంత బలమైన జె.ఏ.సి నిర్మాణాన్ని చేసి చురుకైన పాత్ర పోషించి ఉద్యమాన్ని మిలిటెంట్‌ ‌స్థాయికి తీసుకుపోయినవాడు డ్యాగల సారయ్య సార్‌.

తెలంగాణ జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ కరీంనగర్‌ ‌జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా తెలంగాణ మార్చ్‌కు రిహార్సల్‌గా 16.09.2012 రోజున కరీనంగర్‌ ‌కవాతు చేయాలని తలపెట్టి దాని అనుమతి కోసం అప్పటి జిల్లా జె.ఏ.సి బాధ్యులతో రాష్ట్ర జె.ఏ.సి కో ఆర్డినేటర్‌ ‌పిట్టల రవీందర్‌ ‌కరీంనగర్‌ ‌జిల్లా ఎస్‌.‌పిని కలువడానికి వెళ్ళగా ‘‘మీ కవాతుకు నేను అనుమతిని ఇస్తాను. కాని 14.09.2012 రోజున గవర్నర్‌ ‌ముల్కనూర్‌ ‌పర్యటన ఉంది. ఆ పర్యటనను అడ్డుకుంటామని భీమదేవరపల్లి మండల జె.ఏ.సి ప్రకటన ఇచ్చింది. 1600 మంది పోలీసులను పంపిస్తున్నాము. అయినా వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటారు. అక్కడ గవర్నర్‌ ‌పర్యటనను ప్రశాంతగా జరిగే విధంగా మీరు ఆ జె.ఏ.సి బాధ్యులను ఒప్పిస్తేనే నేను మీ  కరీంనగర్‌ ‌కవాతుకు అనుమతిని ఇస్తాను. లేకపోతే ఇవ్వను. మీరు అక్కడి చైర్మన్‌ ‌డ్యాగల సారయ్య గారితోను, ముఖ్యులతోను మాట్లాడి ఏ విషయమైనా చెప్పండి. మీ ప్రోగ్రామ్‌ ‌సక్సెస్‌ ‌కావాలంటే, మా ప్రోగ్రాం సక్సెస్‌ ‌కావాలి’’ అంటూ అనుమతి కోసం వెళ్ళిన జిల్లా, రాష్ట్ర బాధ్యుల వద్ద ప్రస్తావించిన సందర్భం. 16.09.2010న కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తూన్న శిల్పామోహన్‌రెడ్డి ముల్కనూర్‌ ‌బ్యాంక్‌ ‌సందర్శనకు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక మండల జె.ఏ.సి ఏవిధంగానైనా ఆ పర్యటనను అడ్డుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అతనికి తెలియజేయాలని భావించి, పోలీసుల కళ్ళుగప్పి ప్రతి ఐదుగురితో ఒక దళాన్ని ఏర్పరిచి, ఒక వ్యూహం ప్రకారంగా గెరిల్లా దాడి చేస్తే, బ్యాంకులో వందల మంది పోలీసుల మధ్య దాక్కున్న మంత్రికి, బయట వేలమంది ఉద్యమకారులున్నారని, ఏ క్షణాన్నైనా దాడి జరుగవచ్చని చెప్పి ఓ దొంగదారిగుండా మంత్రిని పారిపోయేవిధంగా పోలీసులు చేస్తున్నప్పుడు జనం ఆ మంత్రి వెంటబడి తరుముతూ రాళ్ళు విసురుతుంటే, బతుకుజీవుడా అంటూ ముచ్చెమటలు పట్టిన శిల్పామోహన్‌రెడ్డి చావుతప్పి కన్నులొట్టపోయి ఆ దాడి నుండి తప్పించుకొని బయటపడ్డాడు. దానిపై చర్చించడం కోసం రాష్ట్ర మంత్రివర్గం మూడుసార్లు సమావేశమైంది. అనంతరం పోలీసులు కేసు పెట్టారు. ఎ1గా డ్యాగల సారయ్య పేరు నమోదైంది. విచారణలో అతను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడని తెలిసిన పోలీస్‌ అధికారులు ఆశ్చర్యపోయారు. తెలంగాణ కోసం మూడు సంవత్సరాలకు పైబడి దీక్షా శిబిరం నడిపాడు. పల్లెపెల్లె పట్టాలపైకి వెళ్ళాలన్నా, రైలు రోకో, రాస్తా రోకో, మిలియన్‌ ‌మార్చ్, ‌సడక్‌బంద్‌, ‌సాగరహారం, సంసద్‌యాత్రలాంటి నిర్ణయాలేవి తీసుకున్నా దాని విజయవంతం కోసం భీమదేవరపల్లి జె.ఏ.సికి కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్‌ల నుండి నేరుగా ఫోన్‌ ‌వచ్చేది. సంసద్‌ ‌యాత్రలో భాగంగా డిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌లో రెండో రోజు ధర్నా ముగిసిన అనంతరం పార్లమెంట్‌ ‌వైపుగా వెళ్ళిన ఉద్యమకారులు అందులోకి చొచ్చుకువెళ్ళడానికి పోలీసులతో పోటీపడుతున్నప్పుడు జరిగిన అరెస్ట్‌లో ఎ1 నుండి ఎ5 వరకు 5గురు భీమదేవరపల్లి జె.ఏ.సి కార్యకర్తలున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ జె.ఏ.సి బలాన్ని! తెలంగాణ ఉద్యమంలో భాగంగా కరీంనగర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంపై దాడి చేసింది భీమదేవరపల్లి మిలిటెంట్‌ ఉద్యమకారులే! అంత బలమైన జె.ఏ.సి నిర్మాణాన్ని చేసి చురుకైన పాత్ర పోషించి ఉద్యమాన్ని మిలిటెంట్‌ ‌స్థాయికి తీసుకుపోయినవాడు డ్యాగల సారయ్య సార్‌. ఉమ్మడి కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాల్లో జరిగిన అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా, దళిత, సామాజిక మరియు తెలంగాణ ఉద్యమాలన్నింటిలో చురుకైన పాత్ర పోషించిన అతడు అందరికి సుపరిచితుడు. భీమదేవరపల్లి మండలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పగలు ఉద్యమం, రాత్రి సభలు, సమావేశాలు పెట్టి నాలాంటి వక్తలనెంతమందినో పిలిచి భాగాస్వామ్యం చేసి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత పాఠాలు చెప్పించాడు. జయశంకర్‌ ‌సార్‌, ‌జనార్థనరావు, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌లాంటి వక్తలను, గద్దర్‌లాంటి గాయకులను పిలిచి 1996 నుండి 2014 దాకా తెలంగాణపై విద్యా సదస్సులు, సభలు నిర్వహించి నినాదాన్ని ఊరి ఊరికి, వాడవాడకు విస్తరించడమే కాదు కాశీం లాంటి ప్రొఫెసర్లను, శ్రీధర్‌రావు దేశ్‌పాండేలాంటి నిపుణులను పిలిచి జె.ఏ.సి కార్యకర్తలకు శిక్షణా తరగతులు పెట్టి క్రమశిక్షణ గల తెలంగాణ కార్యకర్తలను తయారు చేసాడు. రచ్చబండ కార్యక్రమాలను రచ్చరచ్చ చేయడమేకాదు, చివరకు కొత్తకొండ జాతరను కూడా ధూంధాంగా ఉద్యమ స్వరూపంలోకి మార్చి రసమయి బృందాన్ని పిలిచి లక్ష మందితో బారీబహిరంగ సభను ఏర్పరచాడు. కెప్టెన్‌ ‌లక్ష్మీకాంతారావు, కావేరి సీడ్స్ అధినేత గుండవరపు భాస్కర్‌రావు లాంటి అండదండలతో ముల్కనూర్‌ ‌బస్‌స్టాండ్‌ ‌వద్ద అతిపెద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణం చేసాడు. గ్రీకు చరిత్రకారుడు తూసిడైడ్స్‌లాగా ఉద్యమకాలంలో నిర్వహించిన ఘట్టాలు, సంఘటనలు రికార్డ్ ‌చేసిన రిజిష్టర్స్, ‌పత్రికా ప్రకటనల సంపుటి, తాను స్వయంగా రాసుకున్న డైరీ ఆధారంగా భీమదేవరపల్లిలోని ప్రతి ఉద్యమకారుని పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలుపడానికి నిఘంటువులా భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా భీమదేవరపల్లిలో నడిచిన తెలంగాణ ఉద్యమ చరిత్రను 300 పేజీలతో ‘‘మా పోరాటం’’ పేరుతో డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడుతో సహరచయితగా సారయ్య సార్‌ ‌రచించి డాక్టర్‌ ‌తిప్పని సుధాకర్‌లాంటి వారి ఆర్థిక సహాకారం తీసుకొని ముద్రించి 2016లో ఎం.ఎల్‌.ఏ ‌వొడితెల సతీష్‌కుమార్‌ ‌మరియు ప్రొ।। కోదండరామ్‌ ‌చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నడిచిన తెలంగాణ ఉద్యమంపై కొన్ని చారిత్రక రచనలు వచ్చాయి. భీమదేవరపల్లిలో నడిచిన ఉద్యమంపై మినహా రాష్ట్రవ్యాప్తంగా ఒక మండలంలో లేదా ప్రాంతంలో నడిచిన ఉద్యమంపై  ఎక్కడ కూడా రచనలు వెలువడలేదు.
1980లో యుక్త వయస్సులోనే మల్లారం గ్రామంలో ‘రైతుకూలీ సంఘం’ ఏర్పాటు చేసి జీతగాళ్ళ జీతాలు, కూలీల కూలీ రేట్లు పెంచడానికి 23 రోజులు నిరవధిక సమ్మెను చేయడంతో సారయ్య సార్‌ ఉద్యమ జీవితం ప్రారంభమై, 1982లో ముల్కనూర్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌రూరల్‌ ‌బ్యాంక్‌ (‌యం.సి.ఆర్‌.‌బి) హమాలీల కూలీ రేట్లు పెంచడానికి చేసిన పోరాటం సార్‌ను రాటుదేల్చింది. అంబేడ్కర్‌ ‌సంఘంలో చేరి 1982 నుండి దశాబ్ద కాలం పాటు భీమదేవరపల్లి బ్లాక్‌ ‌తదనంతరం, మండల సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన కాలంలో సంఘాన్ని గ్రామ గ్రామానికి విస్తరించడమే కాదు దళితుల సమస్యలపై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజల మనిషిగా మారారు. మండలంలోని విలేఖరులపై ఓ పోలీస్‌ అధికారి దాడి చేస్తే ఆ అధికారిచే వారికి క్షమాపణ చెప్పించే వరకు వదలకుండా ఉద్యమం చేసాడు. ఒక తప్పిపోయిన ఎద్దు కేసులో అన్యాయంగా ఓ దళితుడిని హింసించిన పోలీస్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ ‌చేయించేదాకా వదలలేదు.  ఇవ్వాళ మండలంలో ముల్కనూర్‌, ‌మల్లారం, కొత్తపల్లి, కొత్తకొండ కూడళ్ళలో ఉన్న అంబేడ్కర్‌ ‌విగ్రహాల స్థాపన వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. వెనుకబడిన మరియు మైనారిటీ తరగతుల సమాఖ్య(బామ్‌సెఫ్‌) ‌హూజురాబాద్‌ ‌నియోజకవర్గ కన్వీనర్‌గా 4సం।రాలు పనిచేసి, ప్రస్తుతం అంబేడ్కర్‌ ‌సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఎస్‌.‌సి., ఎస్‌.‌టి అట్రాసిటి చట్టం పరిరక్షణకై ఏర్పడ్డ కమిటీకి హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.
నిత్యచైతన్య భూమి అయిన తెలంగాణలో ఉర్రూతలూగుతున్న ఉద్యమాలలో తన వంతు పాత్రను పోషించడం కోసం ఎ.పి.టి.ఎఫ్‌ ‌లో చేరి సంఘం విడిపోయే క్రమంలో డి.టి.ఎఫ్‌ ‌వైపు నిలబడి భీమదేవరపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా వరుసగా నాలుగుసార్లు పనిచేసారు. తాను పనిచేస్తున్న సంఘంలోని ఆధిపత్యం, వివక్షతలపై ప్రశ్నించడమేకాదు, వాటిపై స్పష్టత ఇవ్వనప్పుడు తాను ఎత్తిపట్టిన సంఘం జెండాను కూడా వదిలిపెట్టి తదనంతరం జరిగిన పరిణామాల వల్ల ఏర్పడిన టి.డి.టి.ఎఫ్‌లోకి మారి ప్రస్తుతం రాష్ట్ర కౌన్సిలర్‌గా కొసాగుతూ, విద్యారంగ, ఉపాధ్యాయ మరియు ఉద్యోగ రంగ సమస్యల సాధనలో ముందుండి ఉద్యమ స్ఫూర్తి, అంకితభావం, నిబద్ధతతో తన బాధ్యతలను నిర్వహించి ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలిచాడు. సారయ్య సార్‌ ‌రాత్రికే రాత్రే నాయకుడు కాలేదు. ఈ విధంగా అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి, 1996 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ 2009 నుండి ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటి (టి.జె.ఏ.సి) భీమదేరపల్లి చైర్మన్‌గా ఎన్నికై మండలంలో ఉద్యమాన్ని రాత్రింబవళ్ళు పరుగులు పెట్టించి ఉద్యమంలో రాష్ట్రస్థాయిలో మండలాన్ని ప్రథమ స్థానంలో నిలిపాడు.
సారయ్య సార్‌ ఉద్యమ కార్యకర్తే కాదు ఆయన గొప్ప క్రీడా కారుడు కూడా. 1980లోనే శ్రీకాకుళంలో జరగిన జూనియర్‌ ‌కబడ్డీ స్టేట్‌ ‌లెవల్‌, 1981‌లో కరీంనగర్‌ ‌జిల్లా స్థాయి, 1982లో గుంటూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో, 1985లో అమృత్‌సర్‌లో జరిగిన ఆల్‌ ఇం‌డియా ఇంటర్‌ ‌యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనడంతో పాటు 1989లో నల్గోండ డి.వి.ఎమ్‌ ‌బి.ఎడ్‌ ‌కాలేజ్‌ ఆల్‌రౌండ్‌ ‌చాంపియన్‌ ‌షిప్‌ ‌సాధించారు. భీమదేవరపల్లి, కాటారం మండలాలలో పనిచేసేటప్పుడు ఉపాధ్యాయులకు క్రీడలు నిర్వహించడంలో కీలక భూమిక పోషించారు. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయులకు ‘‘ఐ లవ్‌ ‌మై జాబ్‌’’ అనే అంశంపై వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా ఉపాధ్యాయులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి పొంది గౌరవ వరంగల్‌ అర్బన్‌ ‌కలెక్టర్‌, ‌డి.ఇ.ఓలచే ప్రశంసాపత్రం, సన్మానం అందుకోవడం జరిగింది. పల్స్‌పోలియో కో-ఆర్డినేటర్‌గా, సూపర్‌వైజర్‌గా, రాత్రిబడుల సూపర్‌వైజర్‌గా, జన్మభూమి, శ్రమదానం గ్రూపు లీడర్‌గా, ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలలో రిసోర్స్ ‌పర్సన్‌గా, ఎల్కతుర్తి మండల ఎడ్యుకేషన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కమిటీ కో-ఆర్డినేటర్‌గా ఎన్నికై జయశంకర్‌ ‌బడిబాటలో చురుకుగా పాల్గొనడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే ప్రతిదానిని సారయ్యసార్‌ ఉద్యమ స్వరూపంలోనే చూశాడు కలగన్నాడు.
డ్యాగల సారయ్య మండలంలోని మారుమూల గ్రామమైన మల్లారంలో 12.08.1961న దళిత  కుటుంబంలో మల్లమ్మ, బాలయ్య దంపతులకు 6వ సంతానంగా జన్మించి, ఎం.ఏ., ఎం.ఎడ్‌.,‌లాంటి ఉన్నత చదువులు పూర్తిచేసుకొని 1989లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి హుస్నాబాద్‌ ‌మండలంలోని కేశవాపూర్‌, ‌భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం, ముస్తఫాపూర్‌, ‌రసూల్‌పల్లి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కాటారంలో పనిచేసి ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్‌, ‌జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుండి ఉద్యోగ విరమణ పొందినారు. తన ఉద్యోగ జీవితంలో కూడా ఆయన ఏనాడు తరగతిని వదిలిపెట్టకుండా వేలమంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్ది వారి భావిజీవితాల్లో కూడా చేదోడువాదోడుగా నిలబడ్డాడు.
ఆయన చేతుల మీదుగా అనేక ఆదర్శవివాహాలు చేయడమేకాదు ఆయనది కూడా కులాంతర వివాహమే. కుటుంబానికి సార్‌ ‌కెటాయించిన సమయం చాలా తక్కువ. సహచరి సత్యవతి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, గృహణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సార్‌ ఉద్యమాలలో పాల్గొనడాన్ని బాగా ప్రోత్సహించారు.   అంతేకాదు ఉద్యమాలలో పాల్గొనడం వల్ల వచ్చిన సమస్యలను, గుర్తు తెలియని ఆగంతకులు ఇంటిపై చేసిన దాడిని సైతం గుండెనిబ్బరంతో ఎదుర్కొని వెనుకడుగు వేయొద్దని సార్‌కు ధైర్యం చెప్పారు. ఇంత ఉద్యమాల నేపథ్యం ఉన్న సారయ్య సార్‌ ‌తన ఇద్దరు పిల్లల విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడు సాయి పవన్‌ ‌హుజురాబాద్‌ ‌కిట్స్‌లో బి.టెక్‌ ‌పూర్తిచేసుకొని, ఖరగ్‌పూర్‌ ఐ.ఐ.‌టిలో ఎల్‌.ఎల్‌.ఎం ‌చదువుతున్నాడు. కుమార్తె శాలిని ఉస్మానియా యూనివర్సిటీ యం.ఎస్సీ కెమిస్ట్రి పూర్తిచేసుకొని గేట్‌కు ప్రిపేర్‌ అవుతున్నది.
లిబరలైజేషన్‌, ‌ప్రైవేటైజేషన్‌, ‌గ్లోబలైజేషన్‌లతో ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం అశాంతితో నిండి ఉన్నది. హక్కులకై కలెబడి, బాధ్యతలకై నిలబడ్డ సారయ్య సార్‌ ‌లాంటి విద్యావంతులు మరియు చైతన్యవంతులు ప్రశాంతంగా ఉండటం సాధ్యం కాదు. ఇకముందు కూడా దళిత, సామాజిక, ప్రజా, విద్యారంగ ఉద్యమాలలో పాల్గొంటూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి మరియు మానవీయ సమాజం ఏర్పాటు కోసం కృషి చేయాలని వారి ఉద్యోగ విరమణ సందర్భంగా తెలంగాణ ఉపాధ్యాయ మిత్రమండలి లాంటి సంస్థలు, నాలాంటివాళ్ళు అభిలషిస్తున్నారు.
డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌ (‌టి.టి.యు).

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy