Take a fresh look at your lifestyle.

‌స్ట్రాంగ్‌రూంలోని ఈవిఎంలకు కట్టుదిట్టమైన భద్రత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో వినియోగించిన ఈవిఎంలను కౌంటింగ్‌ ‌నిర్వహించే మే 23వ తేదీ వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఏను మాముల మార్కెట్‌యార్డు గోదాములలో నిర్మించిన స్ట్రాంగ్‌ ‌రూములందరు ఉంచినట్లు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌పాటిల్‌ ‌తెలిపారు. సిసి కెమె రాలతో పాటు మూడంచెల పోలీసు బలగాల భద్రతను స్ట్రాంగ్‌ ‌రూములకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిసి ఫుటేజీలను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించుకునేందుకు అవ కాశం కల్పించినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా మార్కెట్‌ ‌యార్డు ఎంట్రన్స్‌లో టెంట్‌ ‌వేసినట్లు తెలిపారు. అక్కడికి వచ్చి సిసి ఫుటేజీలు తీసుకునేందుకు వీలు ఉన్నదని తెలిపారు. లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలోని 1859 పోలింగ్‌ ‌కేంద్రాలలో వాడిన పోలింగ్‌ ‌యంత్రాలను మార్కెట్‌యార్డు గోదాముల స్ట్రాంగ్‌ ‌రూములలో ఉంచినట్లు తెలిపారు. శుక్రవారం ఎన్నికల సంఘం జనరల్‌ అబ్జర్వర్‌ ‌డాక్టర్‌ ‌వీణాప్రధాన్‌, ‌పోలీసు అబ్జర్వర్‌ ‌కోన్‌, ‌పోలీసు కమీషనర్‌ ‌డాక్టర్‌ ‌వి.రవీందర్‌, ‌కేంద్ర బలగాల సమక్షంలో స్ట్రాంగ్‌ ‌రూములకు తాళాలు వేయించి సీళ్ళు వేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy