Take a fresh look at your lifestyle.

‌సామ్యవాద సౌధం – బొలీవియా

సాయుధ పోరాటాలకు స్వస్తి పలికి ,తక్కువ ప్రాణత్యాగాలతో ,ప్రజాస్వామ్య పధ్ధతి లోనే అమెరికా అనుకూల ప్రభుత్వాలను గద్దె దించి సోషలిస్టులు అధికారాన్ని చేపట్టి ఇరవైఒకటో శతాబ్దం లో ప్రపంచ పీడిత జనావళికి అశాదీపంగా మారాయి .వెనిజులా ,చిలీ, మెక్సికో, బ్రెజిల్‌, ఉరుగ్వే, పెరూ, పనామా, నికరాగువా, ఈక్వడార్‌లు గులాబీ ఉప్పెన ను స్వాగతించాయి అమెరికా అనేక ఆర్ధిక ఆంక్షలను కుట్రలను చేపడుతున్న మొక్కవోని ధైర్యంతో కొనసాగుతున్నాయి .ఈ కోవలోనే అమెరికా ఆధిపత్యాన్ని సవాల్‌ ‌చేస్తూ సాహసపు గొంతును వినిపిస్తూ మానవాభివృద్ధి సూచికలో అత్యధికరేటు తో బొలీవియాను ఉన్నత స్థానంలోకి చేర్చిన సమతా విప్లవకారుడు ఏవో మొరేల్స్.అమెరికా రాబందు తన మార్కెట్‌ ‌విస్తరణ కోసం ,అపార వనరులున్న దేశాల కోసం తన వేటను కొనసాగిస్తున్నది .మాట వినని ప్రాంతాల నేల పై వాలి వికృత విధ్వంసాన్ని కొనసాగిస్తున్నది .ఇరాక్‌ ,అఫ్హ్గనిస్తాన్‌ ,‌సిరియా ,లిబియా ,పాలస్తినా లో విళయ తాండవం చేసింది .మానవ స్వప్నలోకాన్ని సృష్తిస్తున్న వెనిజులా పై విరుచకపడింది .ఇప్పుడు దాని కన్ను 21 వ శతాబ్దపు సామ్యవాద సౌధంగా విలసిల్లుతున్న బోలివియా పై పడింది .ఈ దేశాన్ని అస్థిరత్వం వైపు నెట్టి కూలదోసే ప్రయత్నాలను కొనసాగిస్తున్నది.
ఇరవైయవ శతాబ్దపు మొదటి భాగంలో భూస్వామ్యం ,కేపిటలిజం ,సామ్రాజ్యవాద కోరల నుండి పీడిత జనావళికి విముక్తి చేసి మహత్తర విజయాలు సాధించిన సోషలిజం రెండో భాగంలో కుప్పకూలిపోయింది.ప్రపంచంలో మూడవవంతుగా ఉన్న సోషలిస్టు శిబిరం అదృశ్యమైంది.మాజీ సోషలిస్టు దేశాలు పెట్టుబడిదారీ విధానాన్ని అనివార్యంగా అక్కున చేర్చుకునే స్థితికి నెట్టివేయబడ్డాయి.రెండవ ప్రపంచ యుద్ధంలో ‘ఆర్యన్‌ ‌జాతి ఆధిపత్యంతో మానవాళిని కబళింపచేస్తున్న నాజీ హిట్లరును ఓడించడంలో సోషలిస్టు శిబిరం చేసిన అసమాన త్యాగాలతో కోట్లాది మానవవనరులు కోల్పోయింది.పారిశ్రామిక,వ్యవసాయ రంగాలు ,అవస్థాపన సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.దీనితో సోషలిస్టు దేశాల పునర్మిణానం వ్యయ ప్రయాసలకు లోనై మందగమనానికి లోనైయింది.ఈ యుద్ధంలో భౌగోళికంగా దూరంగా ఉన్న అమెరికా వస్తూత్పత్తిలో ,అయుధవ్యాపారంలొ దూసుకపొయింది .సోషలిజం అనుసరిస్తున్న తూర్పు యూరప్‌ ‌దేశాలను అస్థిర పరచడానికి అనేక కుట్రలకు పాల్పడింది.రష్యా విప్లవ ప్రేరణ, సహకారంతో ఫ్రెంచ్‌, ‌బ్రిటన్‌,‌స్పెయిన్‌ ‌ల వలసపాలనలో ఉన్న అనేక ఆసియా ఆఫ్రికా లాటిన్‌ అమెరికా దేశాలు విముక్తి పొందాయి.వలస పాలన నుండి విముక్తి చెందిన మూడవ ప్రపంచ దేశాలను వనరుల దోపిడీకి,సామ్రాజ్యవాద విస్తరణ కోసం నయా వలస దేశాలుగా మార్చుకోవడంలో సఫలీకృతం ఐయింది.అనేక దేశాలలో తన మాట వినని పాలకులను గద్దె దించి తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది.ఏక ధ్రువ ప్రపంచానికి పోలీస్‌ ‌గా మారిన అమెరికాకు తన పక్కన ఉన్న లాటిన్‌ అమెరికా దేశాలు ధిక్కార స్వభావాన్ని ,స్వయం స్వాలంబనను ప్రదర్శిస్తున్నాయి .భూమిపుత్రుల సిద్ధాంతంతో లాటిన్‌ అమెరికా దేశాలను స్పెయిన్‌ ‌వలసపాలన నుండి విముక్తిచేసి విమోచకుడిగా సైమన్‌ ‌బోలివర్‌ ‌పై ప్రజలకు కు ఉన్న అభిమానం ,1959 క్యూబా విప్లవం ,మానవజీవితానికి ఒక ఆదర్శ నమూనా గా సాధిస్తున్న ఫలితాలు ,చేగువేరా నాటిన విప్లవ బీజాలు మొదలగు ప్రభావంతో 2000 సంవత్సరం నుండి ‘‘గులాబీ ఉప్పెన ‘‘టర్న్ ‌ద లెఫ్ట్ ‘‘ఉద్యమం ఉవ్వెత్తున లేచింది .సాయుధ పోరాటాలకు స్వస్తి పలికి ,తక్కువ ప్రాణత్యాగాలతో ,ప్రజాస్వామ్య పధ్ధతి లోనే అమెరికా అనుకూల ప్రభుత్వాలను గద్దె దించి సోషలిస్టులు అధికారాన్ని చేపట్టి ఇరవైఒకటో శతాబ్దం లో ప్రపంచ పీడిత జనావళికి అశాదీపంగా మారాయి .వెనిజులా ,చిలీ మెక్సికో బ్రెజిల్‌ ఉరుగ్వే పేరు పనామా నికరాగువా ఈక్వడార్‌ ‌లు గులాబీ ఉప్పెన ను స్వాగతించాయి అమెరికా అనేక ఆర్ధిక ఆంక్షలను కుట్రలను చేపడుతున్న మొక్కవోని ధైర్యంతో కొనసాగుతున్నాయి .ఈ కోవలోనే అమెరికా ఆధిపత్యాన్ని సవాల్‌ ‌చేస్తూ సాహసపు గొంతును వినిపిస్తూ మానవాభివృద్ధి సూచికలో అత్యధికరేటు తో బొలీవియాను ఉన్నత స్థానంలోకి చేర్చిన సమతా విప్లవకారుడు ఏవో మొరేల్స్ .
‌సెప్టెంబర్‌ 24,2019 ‌యు యన్‌ ఓ ‌లో చారిత్రాత్మక ప్రసంగం చేస్తూ అమెరికాపై నిప్పులు చెరిగాడు .ఏక ధృవ ప్రపంచం మానవ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు విపత్తులకు కారణమవుతుందని ,బహుళ జాతి కంపెనీలు నీరు ,ఆహారం ,సహజవనరులను ఆయుధాలు ,శాస్త్ర సాంకేతిక రంగాలను నియంత్రిస్తూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి .అనేక దేశాలలో సంపదను చేజిక్కించుకున్న కొన్ని కుటుంబాలను అధికారాన్ని చేపట్టేలా ప్రోత్సహిస్తూ గ్లోబల్‌ ఒలిగార్కి కి తోడ్పడుతున్నాయి .సుస్థిర ,సంతులిత అభివృద్ధికి కెపిటిలిజం వ్యతిరేకమని అసమాన పంపిణి ,జీవ వైవిధ్యత ,పర్యావరణం క్షిణించడం దాని దుష్పలితాలని తెలియచేసాడు .ప్రపంచంలో ఒక శాతం జనాభా 82% సంపద ను పోగుచేసుకున్నదని ,ఆయుధ వ్యాపారం యుద్ధాలను సృష్టిస్తుందని ఫలితంగా మానవ హననం ,నిరాశ్రయుల సంఖ్య పెరిగిపోవడం విషాదమని పేర్కొన్నాడు .అమెరికా కనుసన్నలలో మెలిగే జి 8 దేశాల కూటమి దీనికి భాద్యత వహించాలని హెచ్చరించాడు .
బొలివియా జనాభాలొ ముప్ఫాతిక వంతు స్థానిక తెగల ములవాసుల నాయకుడిగా ,మూవ్మెంట్‌ ‌ఫర్‌ ‌సోషలిజం రాజకీయ సంస్థను స్థాపించి కార్మిక కర్షకుల జీవన ప్రమాణాల పెంపు కోసం జరిపిన ఉద్యమాల్లో అనేక విజయాలు సాధించాడు .ఈ క్రమంలోనే 2006 లో జరిగిన ఎన్నికలలో అమెరికా అనుకూల కార్లోస్‌ ‌మెసా ను ఓడించి అధికారాన్ని చేపట్టాడు .హ్యూగో చావెజ్‌ ,‌కాస్ట్రో ,చేగువేరా బాటలో ప్రపంచం నివ్వెర పోయేలా సంక్షేమ పాలనను నిర్వహించాడు .తన ముందు పాలకుడు ప్రవేట్‌ ‌పరం చేసిన నీరు ,రవాణ,ఇంధన రంగాలను జాతీయం చేసాడు .వందశాతం సార్వత్రిక విద్యను ,వైద్యాన్ని సాధించాడు .ప్రకృతి వనరులను జాతీయం చేసాడు .విలువైన లిథియం లోహ తవ్వకాలలో బహుళ జాతి సంస్థల భాగస్వామ్యాన్ని తిరస్కరించాడు .పాలనలో ,చట్ట సభలలో పురుషులతో సమానంగా స్త్రీల భాగస్వామ్యం కలిపించాడు .ప్రజల ఆయుప్రమాణం పెరిగింది .స్థానిక జాతుల ఆత్మగౌరవ ప్రతీకగా ఏడు వర్ణాలను ప్రతిఫలించే నలభై చదరాల ‘‘విఫాల ‘‘ అనే రూపొందించి మిలటరీ యూనిఫార్మస్ ‌పై ,ప్రభుత్వ కార్యాలయాలపై ఉండే విధంగా ఏర్పాటు చేసాడు .వారి ఆరాధ్య దైవం పాచమ్మ గా పేర్కొనే తల్లి భూదేవి ని అధికార చిహ్నాముగా మార్చాడు .సమాంతరంగా పారా ఎరుపు పసుపు ఆకుపచ్చ పతాకాన్ని ,క్రెస్తవ విస్వాసాలను కూడా గౌరవించాడు .ఈ విధమైన నవ్య శ్రేయో విధానాలతో పాలిస్తున్న ఏవో మొరేల్స్ ‌పట్ల అభివృద్ధి నిరోధకులకు ,నేరికా సామ్రాజ్యవాదానికి కంటగింపుగా మారి పక్కలో బళ్ళమైనాడు . అక్టోబర్‌ 23,2019 ‌న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్ష నేషనలిస్ట్ ‌రెవెల్యూషన పార్టీ కి చెందిన కార్లోస్‌ ‌మేసా పై పది శాతం అధిక ఓట్లను సాధించి నాలుగవ సారి ఎన్నికైనాడు .మొరేల్స్ ‌గెలుపును జీర్ణించుకోలేని అమెరికా దాని అండ ఉన్న ప్రతిపక్ష పార్టీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని గోబెల్స్ ‌ప్రచారరం చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి .వెంటనే స్పందించిన మొరేల్స్ ఆర్గనైజేషన్‌ అఫ్‌ అమెరికన్‌ ‌స్టేట్స్ అనే సంస్థను విచారణకు అడిట్‌ ‌కు ఆహ్వానించాడు .అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించిన ఈ సంస్థ ఆ తర్వాత అమెరికా ఒత్తిడికి లొంగి గ్రామీణ ప్రాంతాలలో అవకతవకలు జరిగాయని ప్రకటించింది .సెంటర్‌ ‌ఫర్‌ ఎకనామిక్‌ అం‌డ్‌ ‌పాలసీ రీసెర్చ్ ,‌సౌత్‌ అమెరికా న్యూస్‌ ‌నెట్వర్క్ ‌వంటి స్వతంత్ర సంస్థలు కూడా దర్యాప్తు జరిపి ఎన్నికలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చిచెప్పాయి .మొరేల్స్ ‌హుందాగా వ్యవహరిస్తూ మళ్ళీ అధ్యక్షా ఎన్నికలను నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేసాడు .ఇవేమి పట్టని ప్రతిపక్ష పార్టీ తనకు అనుకూలమైన సైన్యంతో తిరుగుబాటు కు తెరలేపి హింసాత్మక పనులకు పాల్పడుతున్నది .అధ్యక్ష భవనం పై దాడి కి ప్రయత్నం చేసింది .మొరేల్స్ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ తో అంతర్యుద్ధం అంచున చేరుకుంది ,పరిస్థిని గమనించిన మొరేల్స్ ‌శాంతి స్థాపన కోసం నవంబర్‌ 10 ‌న రాజీనామా చేసి దేశాన్ని వదిలి మెక్సికో లో రాజకీయ ఆశ్రయం పొందాడు. .
రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించి అధికారాన్ని చేపట్టిన జీనీన్‌ అనీజ్‌ అనే•క అరాచకాలకు తెగబడుతున్నారు .తమ అనుకూల సైన్యంతొ మోరెల్స్ ‌మద్ధతుదారులపై దాడులను చేయిస్తున్నారు .అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి స్థానిక జాతుల దైవం తల్లి భూదేవి చిహ్నాన్ని ,విఫాల జాతీయ పతాకాన్ని తొలగించారు .బోలివియా క్రైస్తవ దేశమని ప్రకటించారు .క్యూబా ,వెనిజుల రాయాబార కార్యాలయాలని మూసివేయించింది .నమూనా మానవ ప్రగతికి తార్కాణంగా నిలిచిన బోలివియ ఇప్పుడు సివిల్‌ ‌వార్‌ ‌కి వేదికయ్యింది . కేపిటలిజంలో సమాజ అవసరాల కంటే వ్యక్తి హక్కులకు ప్రాధాన్యం ఉంటుంది .వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయి .మానవ సంబంధాలలో లాభ నష్టాల అలోచనలే ఉంటాయి .సంపద పంపిణిలో అసమానతలు తీవ్రంగా పెరిగిపోతాయి .కేపిటలిజానికి ప్రత్యమ్నాయంగా స్వయం స్వాలంబన దిశగా కాస్త్రో, చావెజ్‌ ‌ల తర్వాత లాటిన్‌ అమెరికా ఆశాజ్యోతిగా ,భారత్‌ ‌వంటి మూడవ దేశాల స్పూర్తిప్రదాతగా ,రాజకీయ దార్శనికత ,సాహసకితతో కొనసాగిన మోరేల్స్ ‌ను పదవీచ్యుతున్ని చేయడంలో అమెరికా తాత్కాలిక విజయం పొందింది .దేశాన్ని విడిచి వెళుతూ పెరు కవి టుపాక్‌ అమరు కవితను వినిపించాడు .’’మేము మళ్ళీ వస్తాం ,కొత్త రక్తంతో ,కోట్ల మందిమై ,మేము తిరిగి వస్తాం ,కోటి కిరణాలతో రేపటి ఉదయమై ..
అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!