వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌రాష్ట్రంలో జాతీయరహదారులు నిర్మించాలి’.

August 29, 2019

ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన స్పీకర్‌ ‌పోచారం, టీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు.

ఫోటో: ఢిల్లీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీని కలసిన దృశ్యం. చిత్రంలో ఎంపి నామా నాగేశ్వర రావు తదితరులు ఉన్నారు.

రాష్ట్రంలో 3,155 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయరహదారులుగా నిర్మాణం చేయాలని కోరుతూ కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీకి గురువారం ఢిల్లీలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఇతర టిఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటి వరకు కేవలం 1,388 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను మాత్రమే జాతీయ రహదారులుగా గుర్తించారని అన్నారు. మరో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేయాలని కేంద్ర  మంత్రి నితిన్‌ ‌గడ్కరీని కోరారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణలో 50 శాతం వ్యయం, ఆటవి భూముల మళ్లింపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం కేసీఆర్‌ ‌పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారాని కేంద్రమంత్రికి ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ‌నేతలుతెలిపారు. వారు ఇతర అంశాలను ప్రస్తావిస్తూ హైదరాబాద్‌ ‌లోని గౌరెల్లి వద్ద ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌జంక్షన్‌- ‌వలిగొండ-తొర్రూర్‌-‌నెల్లికుదురు-మహబూబాబాద్‌-ఇల్లందు-కొత్తగూడెం(జ 30వ నెంబర్‌ ‌జాతీయ రహదారి జంక్షన్‌)234 ‌కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలని, మెదక్‌-ఎల్లారెడ్డి-రుద్రూరు 92 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇక బోధన్‌-‌బాసర-బైంస 76 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మించాలని, మెదక్‌-‌సిద్దిపేట్‌-ఎల్కతుర్తి 133 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలని కోరారు. ఇక చౌటుప్పల్‌-‌షాద్‌ ‌నగర్‌-‌కంది 186 కిలోమీటర్ల దక్షిణ భాగ ప్రాంతీయ వలయ రహదారి హైదరాబాద్‌ ‌వరకు, సంగారెడ్డి-నర్సాపూర్‌-‌తూప్రాన్‌-‌గజ్వేల్‌-‌భువనగిరి-చౌటుప్పల్‌ ఉత్తర భాగ ప్రాంతీయ వలయ రహదారిని కలపాలని దీనిని ఇప్పటికే జాతీయ రహదారి 161ఎఎ గా గుర్తించారని, కానీ ప్రాజెక్ట్ ‌నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మొదలుపెట్టాలని కోరారు. జనవరి 1వ తేదీ,2019న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కేంద్రానికి లేఖ రాశారని ఈ నాలుగు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో 50 శాతం వ్యయం భరిస్తుందని, ఆటవి భూముల మళ్లింపు వంటి ఆంశాలను చేపడుతుందని తెలిపారు. ఆగస్ట్ 29‌వ తేదీ,2018వ సంవత్సరం మరియు ఆగస్ట్ 1,2019‌వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరో రెండు లేఖలు కేంద్రానికి రాశారని అన్నారు. ప్రాంతీయ వలయ రహదారుల కోసం భూ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వ్యయాన్ని భరిస్తుందని తెలిపారు. ఈ ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి కేంద్ర  ఉత్తర్వులు  వెలువరించి, భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేలా సహకరించాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ ‌లోక్‌సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జాజుల సురేందర్‌, ‌హన్మంత్‌ ‌షిండేలు వున్నారు.