Take a fresh look at your lifestyle.

‘‘‌మరోరోజు’’ ను మళ్ళీ….

పండిన అనుభవాల్లో
ఎండిన దేహం.
విరిగిన చూపుతో
అరిగిన వెన్నుతో
మిణుకుమంటున్న కళ్ళు
వణుకిపోతున్న వ్రేళ్ళు
క్యాలెండర్‌ ‌పైకి ఎక్కలేక ఎక్కి
ఆయాసంతో
కనుచూపుమేరలో కనిపించని
చావుతేదిని గొణుగుతో
భారాన్ని కళ్ళలో కుక్కుకుంటూ…
పైకొచ్చి తొక్కుతున్న
మరో రోజును భరిస్తూ
వయసును ములుకర్రతో
పొడుచుకుంటూ
ప్రాణం ముందుకు’’సాగు’’తుంది.

-చందలూరి నారాయణరావు
9704437247

Leave a Reply