Take a fresh look at your lifestyle.

.‌మందుబాబులకు అడ్డాగా ‘ఏసీ బస్‌ ‌స్టాప్‌’ ‌లు

శేరిలింగంపల్లి, (ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ ‌మహానగర అభివృద్ధిలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం, ఇటీవల కాలంలో ఏసీ బస్టాప్‌లను ఏర్పాటు చేసింది. కానీ అవి మందుబాబులకు అడ్డాగా మారిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

కేపీహెచ్‌బీ ప్రధాన బస్టాప్‌ ‌నందు సాయంత్రం అయిందంటే చాలు..అక్కడ ఇక్కడ ఎందుకులే అని, ఏసీ బస్టాప్‌లకు చేరుకుని ఎంచక్కా మందు లాగించేస్తున్నారు మందుబాబులు. ఈ బస్టాప్‌ ‌ప్రధాన రహదారిపై ఉన్నా సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన ఏసీ బస్టాప్‌లను మందుబాబుల నుండి తప్పించి ప్రయాణికులు వినియోగించుకొనేల చూడాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply