వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రమాదకంగా విద్యుత్‌ ‌స్తంభం.. పట్టించుకోని అధికారులు

April 1, 2019

పదర మండల కేంద్రంలోని ఊరభావి కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్‌ ‌స్తంభంపై భాగంలో సిమెంట్‌ ‌పెక్కులు ఓడిపోయి ఇనుప మేకులు తేలి ప్రమాదకరంగా ఉన్న సంబంధింత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. నిత్యం స్తంభంపై కోతులు సంచరిస్తూ కాలనీ వాసులను భయభ్రాతులకు గురిచేస్తున్నాయని వారు అన్నారు. విద్యుత్‌ ‌స్తంభం విరిగి ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని వారు వాపోయారు.గతంలో విద్యుత్‌ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని కాలనీవాసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే సంబంధిత అధికారులు వెంటనే నూతన విద్యుత్‌ ‌స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ఎల్లమ్మ, పద్మమ్మ, ఆచారి, వెంకటరాజు కోరుతన్నారు.