Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వాలెన్ని మారినా తీరని నిరుద్యోగ సమస్య

ప్రభుత్వాలు ఎన్ని మారినా నిరుద్యోగాన్ని రూపుమాపలేకపోతున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలకు ఈ విషయం కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకు వస్తుంది. దానిపై ఆవేశ ప్రసంగాలు, హామీలను గుప్పించడం, ఆ తర్వాత తామిచ్చిన హామీలను అటకెక్కించడం దాదాపు అన్ని పార్టీలకు అలవాటుగా మారింది. ప్రతిపక్షాలకు ఇవి ఎన్నికల సమయానికి ఆయుధాలుగా మారుతు న్నాయి. కాని, అదృష్టం వరించి నిన్నటివరకు ప్రతిపక్షంలో ఉండి, ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన పార్టీలు చేసేదికూడా ఇదే. అధికార పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత అదికూడా తిరిగి ఇదే అంశాన్ని లేవనెత్తడమన్నది ఒక సహజ ప్రక్రియగా మారింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పదిహేడవ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఇలాంటి సమస్యనే ఎదుర్కోవాల్సి వస్తున్నది. సరిగ్గా అయిదేళ్ళ కింద, 2014లో అధికారంలోకి రావడానికి ముందు తన మానీఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీ ఏమైందని విపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు ఇదే విషయాన్ని ప్రతీ ఎన్నికల సభలో మోదీని ప్రశ్నిస్తున్నాడు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మోదీ భారతదేశంలోని యువకులను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడన్నది ఆయన అభియోగం. మోదీ మాటలను నమ్మి యావత్‌ ‌యువత ఆయనను ప్రధాని సింహాసనం మీద కూర్చోబెడితే, గత అయిదేళ్ళుగా వారికి మోదీ తన శూన్య హస్తం చూపించాడని రాహుల్‌ ‌ప్రతీ సభలో మోదీ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాడు. అంతటిత• ఆగకుండా తాము అధికారంలోకివస్తే ప్రస్తుతం దేశంలో ఉన్న 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని యువతకు హామీ ఇస్తున్నాడు. అంతేకాదు ప్రతీ గ్రామంలో కొద్ది మంది చొప్పున దేశ వ్యాప్తంగా అన్ని పంచాయితీలు కలిపి దాదాపు పదిలక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటున్నాడు. అంతటితోనే ఆగలేదు. ప్రతీ పేదవారి కుటుంబానికి ఏటా 72వేల రూపాయలను వారి ఖాతాల్లో వేస్తానంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ ‌పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనలో విప్లవం తెస్తామంటోంది. అధికారంలోకి రాగానే రెండు లక్షల ముపైవేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు, ప్రతి గ్రామంలో పదిమంది చొప్పున లక్షా యాభైవేల ఉద్యోగాలను కల్పిస్తామంటోంది. ఇలా రాజకీయ పార్టీలు యువతను ఆకట్టుకునేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు దశాబ్దాలుగా హామీల వర్షం గుమ్మరిస్తూన్నా నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నదేగాని ఏమాత్రం తగ్గటంలేదు. నేసనల్‌ ‌సర్వే ఆఫీస్‌ ‌చేసిన ఒక సర్వేలో 2017-2018లో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా పేర్కొంది. గత 45 ఏళ్ళలో ఇది గరిష్టంగా పేర్కొంది. దేశంలో నిరుద్యోగ సమస్య ఒకపక్క తీవ్రతరం అవుతుంటే 2016లో మోదీ తీసుకున్న నిర్ణయం దీనికి పరాకాష్టగా మారిందన్నది ఆ సర్వే నివేదిక తెలుపుతున్నది. భారత ఆర్థిక వ్యవస్థ ఏటా మెరుగుపడుతున్నదని చెబుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే తయారైంది. ఇదిలా ఉంటే దేశంలోని నిరుద్యోగ సమస్యపై తాజాగా అజీమ్‌ ‌ప్రేమ్‌జీ విశ్వ విద్యాలయం మరో సర్వే నిర్వహించింది. ‘‘స్టేట్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ఇం‌డియా 2019’’ పేరున నిర్వహించిన సర్వే మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఏటా లక్షలాదిమంది యువకులు ఉన్నత చదువులతో కళాశాలలు, విశ్వవిద్యాలయా నుండి పట్టభద్రులై బయటికి వస్తున్న వారిలో ఎంతమంది ఉపాధిని పొందుతున్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతోంది. కొత్తగా ఉద్యోగాల కల్పన, ఉపాధి పొందటం మాట అటుంచి, ఉన్న ఉద్యోగస్తులకు కూడా భద్రత లేకుండా పోయింది. తాజాగా బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వేల సంఖ్యలో ఉద్యోగస్తులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ఇండియన్‌ ఏయిర్‌లైన్స్, ‌లాంటి మరికొన్ని సంస్థల ఉనికే లేకుండా పోవడంతో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్తితిలో రెండేళ్ళ కింద ప్రధాని హోదాలో మోదీ తీసుకున్న నిర్ణయం కేవలం రెండేళ్ళ కాలంలో 50లక్షల ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైందని అజీమ్‌ ‌ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం జరిపిన సర్వే నివేదిక వెల్లడించింది. 2016లో నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దుకు నిర్ణయం తీసుకున్నప్పటి నుండీ ఈ ప్రక్రియ కొనసాగుతూ వచ్చిందన్నది ఆ నివేదిక సారాంశం. ఈ ఉద్యోగాలను పొగొట్టుకున్న వారు ఎక్కువగా విద్యావంతులేనని, వీరిలో 20 నుండి 24 ఏళ్ళ మధ్య వయస్సువారే అధికంగా ఉన్నారన్నది ఆ నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పట్టణ ప్రాంతాల్లో కూడా కనీసం వందరోజుల పనిదినాలను కల్పిస్తూ, కనీసం అయిదు వందల రూపాయల వేతనాన్ని అందించాలని ఆ నివేదిక అభిప్రాయపడింది. ఏది ఏమైనా అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు నిరుద్యోగులను కొంత ఆర్థికంగా ఆదుకునే పథకాలను రూపొందించే ప్రయత్నాలే చేస్తున్నాయిగాని, ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రం కల్పించలేకపోతున్నాయంటూ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!