Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వం చర్చలకు పిలస్తే వొస్తాం

సమ్మెపై గవర్నర్‌కు మెమొరాండం
మంత్రుల వ్యాఖ్యలు సరికాదన్న అశ్వత్థామరెడ్డి
అర్టీసి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసి జెఎసి నాయకులు వెల్లడించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని పది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం ఆర్టీసి జెఎసి నాయకులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌తమిళిసైని కలిసి.. ఆర్టీసీ సమ్మె పరిణామాలు, కార్మికుల సమస్యలను వివరించారు. ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసి జెఎసి కన్వినర్‌ అశ్వత్థామరెడ్డి డియాతో మాట్లాడుతూ.. కార్మిక సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, తమను ఆహ్వానిస్తే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. కరీంనగర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని కెసిఆర్‌ ‌హా ఇచ్చారని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామన్నారని తెలిపారు. అయితే, అర్టీసి సమ్మె చట్ట విరుద్ధమని సిఎం కెసిఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొన్న వారిని డిస్మిస్‌ ‌చేస్తున్నట్లు ప్రకటించడంతో కార్మికులు సమ్మెను ఉదృతం చేశారు. దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం డిపో బస్సు డ్రైవర్‌ శ్రీ‌నివాస్‌ ‌రెడ్డి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతనిని హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆదివారం మరణించడంతో సమ్మె తీవ్ర రూపం దాల్చింది. దీంతో మంత్రులు స్పందిస్తూ.. ఆర్‌టిసి కార్మికులు సమ్మె విరమించి, చర్చలకు రావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్‌కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు. కేకే వధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వనం పలకాలని సూచించారు. ’ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని అనుకున్నాం. అయితే డ్రైవర్‌ శ్రీ‌నివాస్‌రెడ్డి మరణంతో కలవడం కుదరలేదు’ అని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని, తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!