వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం

August 23, 2019

ఫోటో: పదేళ్ల లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
ఫోటో: పదేళ్ల లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

దేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌మరోవైపు ఆర్థిక మందగమం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని పేర్కొన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె దిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నామని, గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణల్ని తీసుకొచ్చామని వెల్లడించారు. పన్ను విధానాల్లోనూ సంస్కరణలు తెచ్చామని గుర్తు చేశారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ ‌త్వరితంగా వృద్ధి రేటు నమోదు చేస్తోందన్నారు.
భద్రతను బలోపేతం చేసే విధానాలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. పన్నుల వసూళ్లలో ఎవరికీ ఇబ్బందులు ఉండవు. వాణిజ్య యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపైనా ఉంది. ప్రపంచ జీడీపీ 3.2శాతం నుంచి మరింత పతనమవుతోంది. 2014 నుంచి మేం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌ ‌సురక్షిత స్థితిలో ఉంది. 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నాం’’ అని వివరించారు.
వడ్డీ రేట్ల తగ్గింపునకు కృషి
‘‘రెపో రేట్లకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలపై భారం తగ్గనుందన్నారు. ఈ తగ్గింపుతో గృహ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానమవుతాయని చెప్పారు. మార్కెట్‌లో రూ.5లక్షల కోట్ల ద్రవ్య లభ్యతకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దేశీయ, విదేశీ ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులపై బడ్జెట్‌ ‌ముందునాటి విధానం పునరుద్ధరిస్తామన్నారు. బ్యాంకులకు రూ.70వేల కోట్లు ఆర్థిక సర్దుబాటు చేస్తాం. వడ్డీ రేట్ల తగ్గుదలకు కృషిచేస్తాం. వడ్డీ రేట్ల తగ్గింపుతో లబ్ధిదారులకు చేరేలా ఏర్పాట్లు చేస్తాం. వడ్డీ రేట్ల తగ్గింపును నేరుగా రుణ గ్రహీతలకు అందించేలా చర్యలు తీసుకుంటాం’’ అని నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు.