Take a fresh look at your lifestyle.

‌ప్రజా ఉద్యమంగా మొక్కలు నాటాలి

రెబ్బెన, జూలై 1, ప్రజాతంత్ర విలేఖరి : ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా నేడు రాష్ట్ర మంతటా మొక్కలను నాటుతున్నారని ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములపై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ‌కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్‌ ‌శాసన సభ్యులు  ఆత్రం సక్కు, సిర్పూర్‌ ‌శానన సభ్యులు కోనేరు కొనప్ప కలి సి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఎదుర్కొంటున్న  అతి పెద్ద సమస్య పర్యావరణం అని ఆయన అన్నారు. భూమిపై 33 శాతం అడవి ఉండాలని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరుశాతం కూడా  అడవి లేదని ఆయన తెలిపారు. జూన్‌ ‌మాసంలో ఎండలు కొడుతున్నాయంటే సమతుల్యత లోపించడమే కారణం అని, ఈ ప్రమాదం నుండి బయట పడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు. ఆరేళ్ళగా నాటిన మొక్కలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. అందుకే వీధి వీధికి చెట్లు పెట్టాలన్నది ప్రభుత్వం లక్ష్యం అని ఆయన అన్నారు. పెట్టిన ప్రతి చెట్టును బతికించాలనేది ప్రజల ముందు ఉన్న కర్తవ్యం అని ఆయన తెలిపారు. పంచాయితీ, మున్సిపల్‌ ‌చట్టాల్లోనూ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చామని, మానవాళి భవిష్యత్‌ ‌కూడా మొక్కల పెంపకం చాలా కీలకమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌సందీప్‌ ‌కుమార్‌ ‌ఝూ, ఎస్పీ జిల్లా ఉనతాధికారులు,తెరాన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply