వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రజల దాహర్తిని తీర్చడం అవసరం: కలెక్టర్‌

April 2, 2019

‌ప్రస్థుత వేసవి కాలంలో చలి వేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీర్చడం ఎంతో అవసరమని ములుగు జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ‌కార్యాలయం ముందు స్వేరోస్‌ ‌డివిజన్‌ అర్గనైజింగ్‌ ‌సెక్రెటరీ నక్కరాజు అద్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయానికి నిత్యం అనేక వందల మంది తమ అవసరాల నిమిత్తం వస్తుంటారని వారికి మీరు ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా మంచినీరు అందటం జరుగుతుందని వారి దాహర్తి తీర్చడం హర్శించదగ్గ విషయమన్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన సెంటర్‌ల వద్ద మరి కోంత మంది దాతలు ముందుకోచ్చి మరిన్ని చలి వేంద్రాలను ఏర్పాటు చేయ్యాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఆయన నిర్వాహకులను అభినందించారు. జిల్లా అద్యక్షులు బొట్ల కార్తీక్‌, ‌టిజిపిఏ జిల్లా అద్యక్షులు బోడ రఘు, స్వేరోస్‌ ‌డివిజన్‌ ‌ప్రధాన కార్యదర్శి బోడ రాజు, టిజిపిఏ నాయకులు కొండపల్లి శ్రవణ్‌,‌మాడుగుల సాంబయ్య, మరాటి రవీందర్‌ ‌పాల్గోన్నారు.