వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‘‌పాత పద్ద్దతితో.. కొత్త మార్పు..!’’ మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిని కృషి

April 5, 2019

‘‘ మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో ఎన్నికల్లో హింసను నిరోధంచేందుకు రంగ స్థల కార్యక్రమాలను ఎంపిక చేసుకున్నారు జిల్లా పోలీసు యంత్రాంగం. సిబ్బంది కొందరు జానపద బృందంగా ఏర్పడి గడిచిన కొద్ది నెలల్లో 200 పైగా ప్రదర్శనలు ఇచ్చారు. “తెలంగాణలో లోక్‌ ‌సభ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతోంది. నకిలీ వార్తలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతుల పట్ల జనాన్ని జాగృతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల పోలింగ్‌ ‌సందర్భంగా హింస చోటు చేసుకుంటోంది. ప్రశాంతంగా పోలింగ్‌ ‌కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పోలీసు శాఖ అధినేత్రి, పోలీసు సూపరింటెంట్‌ ‌రెమారాజేశ్వరి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్తితులను బట్టి ఈ రుగ్మతలను పారద్రోలడానికి జానపద కళల ద్వారా ఎందుకు ప్రచారం చేయకూడదనిపించిందని ఆమె అన్నారు. మద్యం, డబ్బు పంపిణీ వల్ల హింస చెలరేగుతుందనీ, ప్రశాంతంగా పోలింగ్‌ ‌జరిగేందుకు అవరోధం అవుతుందని ఈ జానపద బృందాల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్టు రెమా రాజేశ్వరి చెప్పారు. గడిచిన ఎనిమిది మాసాలుగా జిల్లాలో ఈ బృదాలు ఏ విధంగా అయితే సామాజిక రుగ్మతల నివారణ కోసం పాటలు, ఆటలతో జనాన్ని ఆకట్టుకున్నారో అదే మాదిరిగా ఈ ఎన్నికల ప్రచారంలో కూడా అదే మాదిరి పద్దతులను అనుసరించాల ని నిర్ణయించినట్టు ఆమె చెప్పారు తమ జిల్లాలో ఏర్పాటైన జానపద బృందాలు ఇంతవరకూ 200 పైగా ప్రదర్సనలు ఇచ్చాయని ఆమె చెప్పారు.
జానపద నాటికలో ముఖ్యాంశం… ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వారిద్దరూ కష్టించి పని చేసేవారే కొంత భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు ఓ రాజకీయ నాయకుడు ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళింటికి వెళ్ళాడు వారిలో ఒకరికి మద్యం తాగమని ఇచ్చాడు.
దీంతో ఆ కుటుంబంలో చిచ్చు మొదలైంది. అన్నగారిని తమ్ముడు కొట్టాడు. గాయపడిన అన్నగారిని ఆస్పత్రిలో చేర్చారు. తమ్మునిపై కేసు నమోదు అయింది. అతడు గ్రామంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నాడు. కుటుంబం విచ్ఛిన్నం అయింది. ముఠా కలహాలు ప్రారంభమయ్యాయి. మొత్తం గ్రామం అంతటా చిచ్చు రాజుకుంది. తమ తప్పును గ్రామస్తులు తెలుసుకోనేసరికి మొత్తం బూడిద అయింది. అప్పటికే అంతా జరిగిపోయింది. ఎన్నికలు వొచ్చాయి. అభ్యర్ధి గెలిచాడు. ఘర్షణల్లో కేసులు నమోదు అయిన గ్రామస్తులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
ఎన్నికల హింస గ్రామాల్లో వాతావరణాన్ని ఏ విధంగా చెడగొడుతుందో తెలియజేయడమే నృత్య గీతం సారాంశం.
ఈ బృందం కేవలం ప్రదర్శనలు ఇవ్వడమే కాదు. జనాన్ని సమీకరించి వారిని తమ గీతాల ద్వారా చైతన్య పరుస్తోంది. సామాజిక సందేశాలను అందిస్తోంది. ఖాకీ దుస్తులు, టీ షర్ట్ ‌లు ధరించి ఎర్ర శాలువా నడుం కు బిగించుకుని కానిస్టేబుల్‌ ‌రాములు, నలుగురు హోం గార్డులు ఈ నృత్య నాటికను ప్రదర్శిస్తారు.
మేం ఒక మహిళా కళాకారిణిని ఈ బృంద గానానికి తెచ్చాం. పోలీసు టీమ్‌ ‌లో మహిళా కానిస్టేబుల్‌ ఎవరూ లేకపోవడం వల్ల బయటి నుంచి తీసుకుని రావల్సి వచ్చినట్టు రెమా రాజేశ్వరి చెప్పారు.
రాజకీయంగా కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను చేపట్టాం. మా బృందంలో ఆరుగురు సభ్యులు ఉన్నారని రెమా రాజేశ్వరి చెప్పారు.ఎన్నికల కమిషన్‌ ‌మార్గదర్శకాలకు అనుగుణంగానే జానపద నృత్యాలను ప్రదర్శిస్తున్నట్టు ఆమె చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలను నిర్వహించాం,. ఏ గ్రామంలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయో అక్కడ నిర్వహించాం. మొదటి దఫా ప్రదర్శనలు పూర్తి అయ్యాయి. ఏళ్ళ తరబడి ఎన్నికల హింసకు పేరు బడిన ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ ప్రదర్శనలు ఇచ్చాం. ప్రదర్శనల సమయం, ప్రాంతాలను ఆయా గ్రామాల పెద్దలు,అధికారులతో సంప్రదించి నిర్ణయిస్తున్నాం అని ఆమె అన్నారు.
ఎంపిక చేసిన గ్రామంలో సర్పంచ్‌ ‌ని సామాజిక నాయకులనూ, మహిళా సంఘాల ప్రతినిధులను పిలిచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రతి రోజూ రాత్రి ఏడు గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుంది. అప్పటికి రైతులు, పని వారు పొలాల నుంచి ఇళ్ళకు తిరిగి వస్తారు. గత రాత్రి గార్లపహాడ్‌ ‌గ్రామంలో మా బృందం నిర్వహించిన ప్రదర్శనకు 500 మంది వచ్చారు అంటే ఆ గ్రామంలో ఉన్నవారంతా వచ్చారన్న మాట.
గ్రామ పంచాయత్‌ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ఈ గ్రామంలో గత సెప్టెంబర్‌ ‌లో మా బృందం ప్రదర్శన ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధ మవుతున్న వేళ ఆ ప్రదర్శన ఇచ్చింది.
ఈ జిల్లాల • 2009 నుంచి 2014 వరకూ వివిధ సంఘటనలకు సంబంధించి 14 కేసులు నమోదు అయ్యాయి. దేవకద్ర, కోలికొండ గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఈ వివరాలు సేకరించిన తర్వాత ఈ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను జాగృతం చేశామని ఆమె తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ఈ రెండు గ్రామాల్లో ఆ తర్వాత ఏవో రెండు మైనర్‌ ‌కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఐపీసీ 324 కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ ప్రదర్శనలకు తోడు గ్రామాల్ల • కథలు చెప్పే కార్యక్రమం సాగుతోంది. హింస నుంచి గొడవల నుంచి ప్రజలను దూరం చేయడానికి ఇవే మంచి మార్గమని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వీటిని ప్రారంభించామని ఆమె తెలిపారు. ఇది ప్రాచీన సంప్రదాయ విధానం.. ఇలాంటి వాటికి జనం వెంటనే ఆకర్షితులవుతారు.అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని రెమా రాజేశ్వరి చెప్పారు. ఈ కార్యక్రమాల్లో హాస్యాన్ని జోడించడం వల్ల జనానికి మరింత ఆకర్షణీయంగా ఉంటోందని ఆమె అన్నారు. ఎన్నికల హింసకు దూరంగా ఉండండి అనేదే ఈ ప్రదర్శనల ప్రధాన ఇతి వృత్తం.
– ప్రియాంక రిచి, ‘ది న్యూస్‌మినిట్‌’ ‌సౌజన్యంతో.