వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌నీటిపై ప్రయాణం ప్రమాదమే…

September 16, 2019

  • గోదావరిపై ప్రయాణంలో1955 నుండి 2019వరకు  643 మంది మృతి
  • మృతి చెందినవారందరూ..లాంచీ ప్రమాదాలే..!

పాపికొండలు అందాలు ఎంత సుందరంగా ఉంటాయో…ప్రమాయం కూడా అంతే భయంగా ఉంటుందని ఆదివారం జరిగిన బోటుప్రమాదం చెబుతుంది.పకృతి అందాలు తిలకించేందుకు వివిధ ప్రాంతాలనుండి తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ గుడివద్ద నుండి పాపికొండలు బయలు దేరింది.దేవీపట్నం మండలం కచ్చులూరు వచ్చే సరికి బోటు ఒక్కసారిగా గోదావరి ప్రవాహానికి మునిగిపోయింది.ఆసమయంలో 72 మంది ఆబోటులో ఉన్నారు.కొందరు మాత్రం లైఫ్‌జాకెట్లు ధరించడం వలన 14మందిని తూటుగంట గ్రామస్తులు రక్షించారు.మిగతావారు గల్లంతు కావడంతో ఆప్రాంతం అంతా విషాదంతో నిండిపోయింది.గత కొంతకాలంగా చూసుకుంటే గోదావరిపై ప్రయాణంవలన ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్యఎక్కువుగా ఉంటుంది.నీటిపై ప్రయాణం ప్రమాధ కరమని తెలిసినా..బోటుయాజమాన్యం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు.నిండుగోదావరిలో బోటుప్రయాణం చేయడంవలనే ఈ ప్రమాదం జరిగింది.కేవలం డ్రైవర్‌ ‌నిర్లక్ష్యం కారణంగానే 50మంది కోల్పోవలిసి వచ్చింది.మునిగిపోయిన వారిలో చిన్నారులు ఉన్నారు.మొత్తం 61 మంది టిక్కెలు తీసుకోగా పిల్లలకు 9మందికి టిక్కెట్లు లేవు.మొత్తం 72 మంది ఆబోట్‌లో ప్రయాణిస్తున్నారు.తెలంగాణకు చెందినవారు వరంగల్‌కు చెందినవారు 15మంది ఉన్నట్లుగా గుర్తించారు.అలాగే నల్గొండ 4గురు,హైద్రాబాద్‌ 7‌గురు,మంచిర్యాల 1గా గుర్తించచారు.ఎక్కువ మంది ఆంధ్రాప్రాంతానికి చెందిన వారుగా చెబుతున్నారు.

లాంఛీ ప్రయాణంలో 643 మంది మృతి  : 1955 నుండి 2019 సంవత్సరం వరకు ఇప్పటికి గోదావరిపై లాంఛీ ప్రయాణంలో మృతి చెందినవారి సంఖ్య 643కు చేరుకుంది.లాంఛీలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందినవారే…1955 సంవత్సరంలో శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకునేందుకు సారపాకనుండి భద్రాచలం పడవపై గోదావరి దాటుతున్నసమయంలో ఒక్కసారిగా పడవ మునిగిపోవడంతో ఒక్కసారిగా 400 మంది భక్తులు మునిగిపోయి మృతి చెందారు.ఈ ప్రమాదంను గుర్తించిన అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ ‌నెహ్రూ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి మంజూరు చేసారు.ఇదే అతి పెద్దప్రమాదంగా భావించిన ప్రజలకు మరోవిషాదం చోటుచేసుకుంది.50మందికి పైగా గోదావరి మింగింది.అంతేకాకుండా  1970 సంవత్సరంలో అదే పాపికొండలలో  లాంఛీ మునిగి 30మంది మృతి చెందారు.1985లో కూడా 40మంది లాంఛీపై ప్రయాణంలో మృతి చెందారు.2001లో చర్లమండలం వద్ద వాగుదాటుతున్న సమయంలో ఒక్కసారిగా తాలిపేరు నీటిని వదలంతో 23 మంది నీటిలో మునిగి మృతి చెందారు.ఎక్కువ ప్రమాదాలు విహారయాత్రలకు లాంఛీపై ప్రయాణాలు చేయడంవలనే మృతి చెందారు.
స్టీరింగ్‌ ‌చైన్‌ ‌తెగడమే ప్రమాదంకు కారణమా…? : ఆదివారం నాడు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపప్రాతంలో జరిగిన విహారయాత్ర బోట్‌ ‌మునక వెనుక బోట్‌  ‌సరిగా కండీషన్‌ ‌సరిగా లేకపోవడం వలనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.స్టీరింగ్‌కు సంబందించిన చెయిన్‌ ‌తెగిపోవడంవలనే స్టీరింగ్‌ ‌సరిగా తిరగకపోవడం వలనే ప్రమాదంకు గురిఅయినట్ల తెలుస్తుంది.ప్రక్కకు తిప్పేసమయంలో చైన్‌ ‌తెగిపోవడం వలనే కంట్రోల్‌ ‌కాలేదనే విమర్శలు వినపడుతున్నాయి.