వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌నా ఇల్లు తాకట్టు పెడతాననీ మేనేజర్‌కు చెప్పా’

August 27, 2019

ఆటో క్రెడిట్‌ ‌కో-అపరేటివ్‌ ‌సొసైటీ అవగాహన సదస్సులో హరీష్‌రావు

 

ఆటో డ్రైవర్లు, కుటుంబాలలో వెలుగులు నింపేందుకు అవసరమైతే నా ఇంటిని తాకట్టు పెడతాననీ బ్యాంకు మేనేజర్‌కు చెప్పా. ఆటో డ్రైవర్లు ఎట్టి పరిస్థితులలో నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేసుకోవాలనీ, సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్‌లో నిర్వహించిన సిద్దిపేట ఆటో క్రెడిట్‌ ‌కో-అపరేటివ్‌ ‌సొసైటీ అవగాహన సదస్సులో పాల్గొన్న హరీష్‌రావు మాట్లాడుతూ…ఆటో డ్రైవర్ల కుటుంబాలలో వెలుగులు నింపే సరికొత్త కార్యక్రమాలను చేపడుతున్నామనీ, అయితే ఆటో డ్రైవర్లలో కూడా మార్పు రావల్సిన అవసరం ఎంతైనా ఉందనీ తన్నీరు హరీష్‌రావు అన్నారు.  ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. సిద్దిపేట అన్నింటిలో ఆదర్శమనీ, ఆటో డ్రైవర్లు, కుటుంబాలలో వెలుగులు నింపే ఈ కార్యక్రమం ఇక్కడ నుండి ప్రారంభిస్తున్నామన్నారు.