వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌డియా సమావేశంలో పివి సింధు

August 28, 2019

టోక్యో ఒలంపిక్‌ ‌తన తదుపరి లక్ష్యమని బ్యాడ్మింటన్‌ ‌ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి, సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చిన  స్వర్ణ సింధు పేర్కొంది.  మంగళవారం గోపిచంద్‌ అకాడలో విలేకర్లతో మాట్లాడిన ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ‌గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల కల నెలవేరింది. ఈ విజయం కోసం చాలా ఏళ్లు ఎదురు చూశా. విజయం కోసం నాకు ఎల్లవేళలా వెన్నంటి ఉన్న గోపి సర్‌కి, కిమ్‌ ‌మేడమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఇక నా తదుపరి లక్ష్యం 2020-టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణం’ అని ఆమె చెప్పారు.  ‘దీనికోసం చాలా పోటీ ఉంటుందని తెలుసు. కానీ, నా వ్యూహాలు నాకున్నాయి. ఒలంపిక్స్‌కు ముందు చాలా టోర్నీలు ఆడాలి. సూపర్‌ ‌సిరీస్‌లు ఆడాలి. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు టెక్నిక్స్ ‌మెరుగుపరుచుకుంటాను. టాప్‌-10 ‌ప్లేయర్స్ అం‌దరికీ తమ బలాలు, బలహీనతలు తెలుసు. కావున, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలి’ అన్నారు . ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ఫోటో: బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌నరసింహాన్‌ను కలిసిన
పివి సింధు, మానసి జోషి.