Take a fresh look at your lifestyle.

‘‌టెన్షన్‌లోనూ టెన్త్ ‌ఫలితాలపై హరీష్‌ ‌దృష్టి’..!?

ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో హరీష్‌రావు
రాష్ట్ర మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు పనికి మారుపేరు. సక్సెస్‌కు కేరాఫ్‌. ఏ ‌పనైనా మొదలుపెడితే ఆపనిని సక్సెస్‌ ‌చేసేంత వరకూ వదలడు. నిద్రపోడు. పట్టువదలడు. ప్రయోగాత్మాక పథకాల సక్సెస్‌కు, రూపకల్పనకు సిద్ధిపేటను చిరునామాగా చేసిన హరీష్‌రావు తాజాగా… తన దృష్టిని 10వ తరగతి విద్యార్థులపై కేంద్రీ కరించారు. అధికారిక కార్యక్రమాలతో ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండటంతో పాటు, వ్యక్తిగతంగా అనేక టెన్షన్లు ఉన్నప్పటికీ…త్వరలో జరగబోవు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలన్న దృష్టి శనివారం సిద్ధిపేటలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతి మాటలో, ప్రతి సందర్భంలోనూ హరీష్‌లో అణువణువూ అగుపించింది. ప్రభుత్వ బడులలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులందరూ ఫస్టు ఉండాలన్న హరీష్‌ ‌బలమైన కోరిక, తపన సమీక్షా సమావేశానికి జిల్లా నలు మూలల నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కట్టిపడేలా చేసింది. హరీష్‌ ‌తపనకు అందరూ ఫిదా అయ్యారు. ఆయన మాటలు అందరూ కమిట్‌మెంటుతో పని చేసేలా చేసింది. సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ బడులలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు రాష్ట్రంలో అగ్రభాగాన నిలవాలని పరితపిస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లాను 10వ తరగతి పరీక్షా ఫలితాల ఉత్తీర్ణతలో అగ్రస్థానంలో నిలిపి సిఎం కేసీఆర్‌ ‌జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా చేయాలని ప్రభుత్వ బడుల ప్రధానోపాధ్యాయులకు టార్గెట్‌ ‌పెట్టారు. త్వరలో 10వ తరగతి పరీక్షను రాయనున్న విద్యార్థులు 10 పాయింట్లు సాధిస్తే 25వేల రూపాయల నజరానాను ప్రకటిస్తూనే… నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయనీ హరీష్‌ ‌రావు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం సిద్ధిపేటలోని ఉపాధ్యాయ భవన్‌లో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేం దుకు జిల్లా స్థాయి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపా ధ్యాయుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…పదో తరగతి ఫలితాలలో తెలంగాణ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండే విధంగా చర్యలు తీసు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఎస్సెస్సీ విద్యార్థుల ప్రగతి గురించి ఆరా తీశారు. గత ఫలితాలలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం ఉన్న పాఠశాలల హెచ్‌ఎం‌లను మందలించారు. సగటు ఫలితాలు వచ్చిన వారిని ప్రోత్సహించారు. మార్చి 16 నుంచి పరీక్షలు ఉన్నందున ఈ వ్యవధిలో బాగా శ్రమించాలని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్‌ ‌కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పాఠశాల 95శాతం ఉత్తీర్ణత దాటితేనే సిద్దిపేట జిల్లాకు ప్రథమ స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. గత ఏడాది కూడా ఇదే విధంగా సమీక్షలు జరిపితే 13వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకామని , ఇప్పుడు ఒకటో స్థానం కోసం కష్టపడాలని హరీశ్‌ ‌రావు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు తనవంతుగా రూ.25వేల నజరానా అందిస్తానని ప్రకటించారు. ఉత్తమ ఫలితాల కోసం కష్టపడిన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తానని అన్నారు. పాత ర్యాంకు కూడా దక్కకుంటే అందుకు కారణమైన వారిపై చర్యలు కూడా ఉంటాయని సున్నితంగా హెచ్చరించారు.

వెంటనే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను చేపట్టాలని, వారికి స్నాక్స్ అం‌దించాలని సూచించారు. ఎలాంటి సహాయం కావాలన్నా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ ‌నంబర్లు ఇస్తే అవసరమైతే తానే మాట్లాడతానని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ‌నుంచి కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు వాయిస్‌ ‌మెసేజ్‌ అం‌దుతాయని తెలిపారు. ఇప్పటి నుంచే హెచ్‌ఎం‌లు అప్రమత్తం కావాలని, ఈ నెలాఖరులో మరోసారి సమీక్ష నిర్వహించుకుందామని అన్నారు. అదే విధంగా మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని కోరారు. పాఠశాలల్లో ఖాళీ స్థలం ఉంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలని, ఇందులో విద్యార్థులను భాగస్వాములను చేయాలని హరీష్‌రావు సూచించారు. ప్లాస్టిక్‌ ‌నిర్మూలనపై కూడా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తే ఒక మంచి సమాజ నిర్మాణానికి పునాది వేసినట్లవుతుందని హరీష్‌రావు వెల్లడించారు. మొత్తానికి ప్రభుత్వ బడులలో 10వ తరగతితో ఉత్తీర్ణత శాతం కనీసం 95శాతం సాధించాలన్న హరీష్‌రావు పట్టుదల అందరినీ ఆకర్షించింది. ఆకట్టుకుంది. హరీష్‌రావు మాటలు ప్రధానోపాధ్యాయులలోనూ ఆలోచనలో పడేలా చేయడంతో పాటు మనమెందుకూ ఫస్టు రావొద్దు అనే విధంగా ప్రేరణ కలిగించాయనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, సమీక్షా సమావేశానికి వచ్చినవాళ్లలో కొందరూ హరీష్‌ ఓపికను చూసి ఆశ్చర్యపోయారు కూడా. ఇంత బిజీలోనూ ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణతపై దృష్టి పెట్టడం హరీష్‌కే సాధ్యమైందనీ పలువురు చర్చించుకోవడం వినిపించింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌దేవరకొండ కృష్ణ భాస్కర్‌, ‌డిఈవో రవికాంత్‌ ‌తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!