Take a fresh look at your lifestyle.

‘‌జాతీయ’ ఆధిపత్యపోరులో ఇద్దరు చంద్రులు

తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు లిద్దరు కూడా జాతీయ రాజకీయాల్లో తమ ఆదిపత్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. కేంద్రంలో ప్రస్తుత భార తీయ జనతా పార్టీ, గత కాంగ్రెస్‌ ‌పార్టీల కూటముల పాలనతో విసుగుచెందిన ప్రజలు కొత్తదనాన్ని కోరుకుం టున్న క్రమంలో దాన్ని తమకు అను కూలంగా మలుచు కోవాలని ఈ ఇద్దరు చంద్రులు తమదైన శైలిలో ఎత్తు గడలు వేస్తున్నారు. బిజెపి తనను నిలువునా మోసం చేసిందని చంద్రబాబునాయుడు, దేశ రాజకీయాల్లోనే గుణాత్మక మార్పును తీసుకువస్తానని, అందుకు కాంగ్రెస్‌, ‌బిజెపి యేతర ఫెడరల్‌ ‌ఫ్రంట్‌పేర మరో కూటమిని ఏర్పాటు చేస్తానని కెసిఆర్‌లు జాతీయ రాజకీయా)పై దృష్టి పెట్టారు. కెసిఆర్‌ ‌మాత్రం తాను కేంద్ర రాజకీయా లపై దృష్టి పెట్టడమేకాకుండా స్వయంగా పాల్గొంటానని చెప్పడంతో పాటు అందుకు తగిన ప్రణాళికలను కూడా రూపొందించుకుంటున్నాడు. తాను జాతీయ రాజకీయా ల్లోకి వెళితే ఇక్కడి పాలనా బాధ్యతలను తన కుమారుడైన కెటిఆర్‌కు అప్పగించాలన్న పథక రచనను ఆయన నిగూఢం గానే కొనసాగిస్తున్న విషయం తెలియంది కాదు. చంద్ర బాబు మాత్రం గతంలో లాగానే ఉన్న చోటే ఉండి చక్రం తిప్పగలలన్న ధీమాతో ఉన్నాడు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ అం‌టేనే కుంభకోణాల నిలయమని పేరు రావ డంతో ప్రజ లంతా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో నరేంద్ర మోదీని ప్రధానిగా చూపించి భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. యావత్‌ ‌దేశమంతా బిజెపి కన్నా నరేంద్ర మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగాలు, హావ భావాలకు యువత ఫిదా అయ్యారు. ప్రపంచ దేశాలను పర్యటిస్తున్న ప్పుడు ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. విశేష ఆదరణ, సత్కారాలు ఆయ నకు లభించాయి. నేరేంద్ర మోదీ ప్రధానిగా ఏదో చేస్తా డన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగింది. కాని, పెద్ద నోట్ల రద్దు, యువతకు ఉపాధి తదితర అంశాల విష యంలో ఆయనపై ప్రజలకున్న ఆశలు క్రమేణ సడలుతూ వచ్చాయి. దానికి తగినట్లు ఇటీవల ఆయన పాలనలో కూడా కుంభకోణాలు వెలుగులోకి రావడం, దానిపైన ఉన్నత సభల్లో రోజుల తరబడి చర్చలు జరుగుతుండడం ఆయనకు ఆదరణ తగ్గడం మొదలైంది. కేవలం ప్రజలకే కాకుండా ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా గడ్కరీ లాంటి వాళ్ళు కూడా మోదీ తీరుపై పరోక్ష ఆరోపణలు చేయడం కూడా ఆయన ప్రతిష్ట దిగజారడానికి కారణంగా మారు తున్నది.

దీంతో తుంట ఎత్తేసి, మొద్దు ఎత్తుకున్న నానుడిలా ఇప్పుడీ రెండు పార్టీలకు భిన్నమైన పాలన కోసం ప్రజలి ప్పుడు మరోసారి ఆలోచించడం మొదలు పెట్టారు. ఇప్ప టికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌లాంటి కొందరు నాయకులు, కొన్ని రాష్ట్రాలు ఈ రెండు జాతీయ పార్టీలకు దూరంగా ఉంటూ ప్రత్యమ్నాయం కోసం చూస్తున్న విషయం తెలియంది కాదు. ఇది తమకు అందివచ్చిన అవకాశంగా ఇద్దరు చంద్రులు జాతీయ రాజకీయాలపైన దృష్టిని కేంద్రీకరించారు. జాతీయ రాజ కీయాల్లో ఒకరు అనుభవం కలవారైతే, మరొకరు తానేమీ అందుకు తీసిపోనన్న ధోరణిలో దూసుకుపోతున్న వ్యక్తి. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలతో వీరిద్దరూ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభిం చారు. వీరిద్దరి ప్రయత్నాల్లో చంద్రబాబుకు కాస్త రెస్పాన్స్ ‌బాగానే వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో బిజెపి నీ వ్యతిరేకిస్తున్న పార్టీలు దాదాపు ఇరవైకి పైగా హాజర వడం ఆయన ప్రయత్నాలకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కెసిఆర్‌ ‌పర్యటనను పరిశీలిస్తే అయనతో కలిసి రావడానికి ప్రాంతీయ పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది ఇంకా స్పష్టం కావడంలేదు. ఈ విషయంలో ఇంకా అనేకసార్లు చర్చలు జరుగాల్సి ఉం దని, ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ అం‌టే అంత అషామాషీ కాదంటూ మీడియా సమావేశాల్లో స్వయంగా కెసిఆర్‌ ‌చెబుతుండ డంతో వీరిద్దరు తమ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదన్నది స్పష్టమవుతోంది. పద్నాలుగేళ్ళ పాటు సాగిన తెలంగాణ పోరాటంలో ఒంటరిగానే పయనించానని తరుచూ చెప్పే కెసిఆర్‌ ‌గమ్యస్థానం చేరుకునే విషయంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పోరాటం చేస్తాడన్న పేరుంది కూడా. వాస్త వానికి ఎవరైనా ఇంటగెలిచి రచ్చ గెలువాలంటారు. ఇద్దరూ ఇంట గెలిచిన వారే. అయితే అది అయిదేళ్ళ కింది మాట. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వారి పాలనా తీరుకు అద్దంపట్టేది ఈ అయిదేళ్ళ కాలం. ఈ విషయంలో ఆరు నెలల ముందే తొందరపడి తన పనితీరేమిటన్నది ప్రజలనుండి సర్టిఫికెట్‌ ‌పొందిన వ్యక్తి కెసిఆర్‌. ‌త్వరలో అలాంటి సర్టిఫికెట్‌ను చంద్రబాబు నాయుడు పొందాల్సి ఉంది. అప్పుడే రచ్చ గెలుపెవరి దన్నది తేలనుంది. ఇదిలా ఉంటే ఈ ఆధిపత్య పోరులో ఇద్దరు చంద్రులు మాటలు మీరుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసు కుంటున్నారు. తాము ముఖ్యమంత్రుల మన్న విషయాన్ని పక్కకు పెట్టి పరుష పదాలను వాడ డంలో కూడా ఏ మాత్రం సందేహపడడం లేదు. ఎవరికి వారు ఎదుటి వారి ప్రతిష్టను దిగజార్చడం ద్వారా జాతీయ స్థాయి నేతగా ఎదుగాలన్న వీరిద్దరి ప్రయత్నాలు ఏ మేరకు నెరవేరుతాయన్నది పార్లమెంటు ఎన్నికల్లో తేలిపోనుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy