Take a fresh look at your lifestyle.

‌ఘనంగా సెప్టెంబర్‌ 17

అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
: కేటీఆర్‌ ‌ట్వీట్‌

సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోన దినోత్సవాన్ని పురస్కరించుకొని.. హైదరాబాద్‌ ‌తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు.నైజాం వ్యతిరేక పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెటిఆర్‌ ‌పేర్కొన్నారు. భారత యూనియన్‌ ‌లో హైదరాబాద్‌ ‌సంస్థానం విలీనమైన సెప్టెంబర్‌ 17‌ను పురష్కరించుకుని కెటిఆర్‌ ‌తెలంగాణ భవన్‌ ‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. నాటి నైజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎందరో తెలంగాణ వీరులు అమరులయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. జై తెలంగాణ.. జై హింద్‌ అం‌టూ ఆయన ట్వీట్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మల్లారెడ్డి, ఎంఎల్‌ ‌సిలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌ ‌పలువురు టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ‌పాలన నిజాంను తలపిస్తున్నది..
: బీజేపీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన రాష్ట్ర అధ్యక్షుడు డా।। లక్ష్మణ్‌
‌బీజేపీ కార్యాలయంలో విమోచన దినం

కేసీఆర్‌ ‌పాలనను చూస్తుంటే నిజాం పాలనను తలపిస్తుందని, గతంలో నిజాం పాలనను విన్నామని, ఇప్పుడు స్వయంగా చూడాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌టీఆర్‌ఎస్‌‌ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ ‌సీహెచ్‌ ‌విద్యాసాగర్‌రావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తేనే విమోచన దినోత్సవం అధికారకంగా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. సెప్టెంబర్‌ 17‌న తిరంగా యాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఊరి నిండా జాతీయ జెండా నినాదంతో.. ప్లలె ప్లలెలో జాతీయ పతాకాలు ఎగురవేస్తున్నామని లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. యాదాద్రిపై కేసీఆర్‌ ‌బొమ్మ చెక్కించుకున్నారని, నిజాం ఆగడాలు విన్నామని, ఇప్పుడు చూస్తున్నామని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి మాట్లాడుతూ.. సర్దార్‌ ‌వల్లభబాయ్‌ ‌పటేల్‌ ‌దూరదృష్టితో తెలంగాణ కు విమోచనం లభించిందని అన్నారు. హైదరాబాద్‌ ‌విలీన అంశాన్ని పటేల్‌ ‌డీల్‌ ‌చేసి విముక్తి కల్పించారు. కశ్మీర్‌ను అంశాన్ని డీల్‌ ‌చేసిన నెహ్రూ 370 ఆర్టికల్‌ ‌పేరుతో ఆ ప్రాంతాన్ని సమస్యాత్మకంగా మార్చారు. నేడు ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా చొరవతో కశ్మీర్‌ ‌సమస్య పరిష్కారమైంది. 370 ఆర్టికల్‌ ‌రద్దు అయ్యింది అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోకేసీఆర్‌ ‌కారుపై మజ్లీస్‌ ‌సవారీ చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ’కారు రిమోట్‌ ‌మజ్లీస్‌ ‌చేతిలో ఉంది. రాజు గారి కుక్క చనిపోతే డాక్టరును సస్పెండ్‌ ‌చేస్తారుకాని, మనుషుల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్కలేదని ఘాటుగా విమర్శించారు.

నెహ్రూతో సాకారమైన తెలంగాణ
గాంధీభవన్‌లో జెండా ఎగురేసిన పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి

నిజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమం చేశాయన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి. సెప్టెంబర్‌ 17 ‌విలీన దినోత్సవం సందర్భంగాగాంధీ భవన్‌ ‌లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులకు సన్మానం చేశారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందన్న ఉత్తమ్‌ ఆం‌ధ్ర వ్యక్తి రామ్‌ ‌మాధవ్‌కు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు. హైదరాబాద్‌ ‌విలీనం అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారన్నారు. ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని నెహ్రూ,పటేల్‌ల సారథ్యంలో సైనిక చర్యకు పూనుకున్నారని అన్నారు. కమ్యూనిస్టులు ఆనాటి పోరాటంలో కీలక భూమిక పోషించారని అన్నారు. బిజెపి ఈ విషయంలో చరిత్రను వక్రీకరిస్తోందని అన్నారు. ఇదిలావుంటే తెలంగాణ సాయుధపోరాటంలో కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులదే కీలక పాత్ర అని కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు నష్టం కలగకుండా నెహ్రూ, పటేల్‌ ‌కలిసి హైదరాబాద్‌ను విలీనం చేశారని ఆయన స్పష్టం చేశారు. అన్ని మతాల పోరాట ఫలితమే విలీనమన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు పోరాడేవన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల ఉద్యమాలే లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy