Take a fresh look at your lifestyle.

‌గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి

సర్వసభ్య సమా వేశంలో జిల్లా పరిషత్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పెద్దపల్లి పద్మావతి – కరోనా కారణంతో 4అంశాలపైనే జరిగిన చర్చ

నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 29. ప్రజాతంత్రవిలేకరి: గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ముం దుకు తీసుకెళ్లాలని దీనికి అధికారులందరు కృషి చేయాలని జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌పెద్దప ల్లి పద్మావతి అన్నారు. శుక్రవారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌లోని డి కె ఆర్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్‌ ‌సర్వసభ్య సమావేశం లో ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ ‌భవనాన్ని త్వరలోనే ప్రారంభించు కోబోతున్నట్లు తెలి పారు.కోవిడ్‌ ‌కారణంగా ఈ సమావేశంలో కేవలం 4 అంశాలపై మాత్రమే చర్చ నిర్వ హించారు.కోవిడ్‌ ‌పై చర్చ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఇ. ‌శ్రీధర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో ఇప్ప టి వరకు కేవలం రెండు కేసులు మాత్రమే పాజిటివ్‌ ‌వచ్చాయని,ఇటీవల వచ్చి న మరో రెండు కేసులు జిల్లావాసులు హైదరాబాదు లో  స్థిరపడినవారికి వచ్చాయని తెలిపారు.  కరోనా లాక్డౌన్‌ ‌పీరియడ్‌ ‌లో సుమారు 36 వేల మంది వలస కూలీలు బయటినుండి జిల్లాకు వచ్చారని, వీరందరికీ బియ్యంతో పాటు ఐదువందల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ‌సభ్యులు రాములు మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన వలస కూలీల తోపాటు ఇకపై జిల్లాకు ఎవరైనా వస్తే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా సౌకర్యాలు కలగజేయాలని కోరారు.  కలెక్టర్‌ ‌మాట్లాడు తూ మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో ఉమ్మడి  జిల్లాలకు సంబం ధించిన తలసేమియా వ్యాధి గ్రస్తులకు ఏ ర్పాట్లు ఉన్నాయని తెలిపారు.అలాగే ఆయా ప్రాంతాల అవసరాల కనుగు ణం గా అంబులెన్సులను ఏర్పాటు చేయడం జరరు గు తుందని కోడేరు జెడ్‌పిటిసి లేవనెత్తిన అంశంపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని జవాబు ఇచ్చారు.

వ్యవసాయం పై జరిగిన చర్చ సందర్భంగా వ్యవసాయ అధికారి సింగారెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వానకాలం 2020, నియంత్రిత వ్యవసాయ  సాగులొ భాగంగా జిల్లాలో ఈ వానకాలం 562299 ఎకరాలలో సాగు అంచనా ప్రణా ళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.ఇందుకు గాను  విత్తనాలు, ఎరువులు సిద్ధం గా ఉంచడం జరిగిందని, అంతేకాక రైతు వేదికల నిర్మా ణంలో భాగంగా  ఇప్పటివరకు 135 వేదికల కు స్థలాలు చూడడం జరిగిందని, మరో 13 రైతు వేదికలకు చూడాల్సి ఉందని, ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాటిని కూడా చేప డతామని తెలిపారు. రుణమాఫీకి సంబం ధించి 25వేల రూపాయల లోపు రుణాలు ఉన్నవారు  7841 మందికి  సుమారు పది కోట్ల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇంకా 13095 మందికి ఆధార్‌ అనుసంధానం కానందున వారి ఖాతాలో అమౌంట్‌ ‌జమ కావలసి ఉందని తెలిపారు.ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  రైతులు సన్న రకాలను సాగు చేయాలని, మొక్కజొన్న వేయవద్దని   రాష్ట్రంలో సరిపోయినంత మొక్క జొన్న   నిల్వలు ఉన్నందున రైతులు దీనిని దృష్టిలో ఉంచుకొని కంది పత్తి వంటి పంటలు సాగు చేయాలని కోరారు.  వ్యవసాయ శాఖ పై జరిగిన చర్చ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు,ఎంపిపి లు మాట్లాడుతూ గతంలో ప్రతి మండలానికి ఒక ఒక గ్రామాన్ని పైలెట్‌ ‌గా తీసుకొని భూ సార పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఇప్పటివరకు వాటి ఫలితాలను ఇవ్వలేదని, అలాగే వ్యవసాయ రంగంలో రాబోయే కాలంలో కూలీల కొరత ఎక్కువగా ఉంటుందని, అంతేకాకుండా సన్న రకాలను సాగు చేస్తే కచ్చితంగా ప్రభుత్వమే కొనేలా భరోసా ఇవ్వడంతో పాటు, మద్దతుధర ఇచ్చేలా చూడాలని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. పంచాయతీ , పారిశుద్ధ్య అంశాలపై జరిగి న చర్చ సందర్భం గా నాగర్‌ ‌కర్నూల్‌ ‌శాసన సభ్యులు మర్రి జనార్దన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసిన నీటి  ట్యాంకులు  నాసిరకంగా ఉన్నాయని, వీటి పై సమగ్ర విచారణ జరిపించి సంబంధి త లపై చర్య తీసుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం లో చేపట్టిన పనులు , తీసుకున్న చర్యలు, అలాగే హరితహారం పై నిర్లక్ష్యం వహించిన వారి పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా గ్రామాలలో వెచ్చించిన ఖర్చు, తదితర విషయాలపై దృష్టిసారించాలని అన్నారు. అంతేకాక జిల్లాలో మండలానికి ఒక గ్రామ పంచాయతీ అయినా ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని ,ఇందుకు గాను తాము కూడా సహకారం అందిస్తా మని ,ముఖ్యంగా డంపింగ్‌ ‌యార్డ్ ‌నిర్మాణం వైకుంఠ దామాలు హరితహారం విషయంలో ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల ప్రజలు చె ప్పుకునే విధంగా కనీసం ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.  జిల్లా కలెక్టర్‌ ‌మాట్లా డుతూ ఎం పి పి, జెడ్‌పిటిసిలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దని వెల్ల డించారు. ఈ సమావేశానికి అచ్చంపేట శాసన సభ్యులు, ప్రభుత్వ విప్‌ ‌గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ కూచికుల్ల దామోదర్‌ ‌రెడ్డి,కొల్లాపూర్‌ ‌శాసనసభ్యు లు హర్షవర్ధన్‌ ‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌మనుచౌదరి, జిల్లా పరిషత్‌ ‌సీఈఓ నాగమణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ‌సుధాకర్‌ ‌లాల్‌, ‌డి ఆర్‌ ‌డి ఓ సుధాకర్‌, ‌పెద్దకొత్తపల్లి జడ్పిటిసి మేకలగౌరమ్మ చం ద్రయ్య, కల్వకుర్తి జడ్పిటిసి భరత్‌ ‌తదితరులు హాజరయ్యారు.

Leave a Reply