వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌గోల్కొండ’లో కొనుగోలు చేద్దాం..వృత్తి కళలను, కళాకారులను ప్రోత్సహిద్దాం:హరీష్‌ ‌రావు

September 4, 2019

  • సిద్ధిపేటలో హస్తకళల విక్రయశాల ప్రారంభం.

వృత్తి కళలను, కళాకారులను ప్రొత్సహిద్దాం. జిల్లాలో కార్యక్రమం ఏదైనా సరే.. వృత్తి కార్మికులను దీవించే విధంగా గోల్కొండ హక్తకళల విక్రయశాలలో కొనుగోళ్లు చేద్దామని జిల్లా అధికారిక వర్గాలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌సర్కిల్‌ ‌లో రూ.2కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోల్కోండ హస్తకళల విక్రయశాలను ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌శైలజ రామ అయ్యర్‌ ‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు. వీరి వెంట ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామ రెడ్డి, ఛైర్మన్‌ ‌బొల్లం సంపత్‌ ‌కుమార్‌, ‌మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజనర్సు, సుడా ఛైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డిలు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు మాట్లాడుతూ.. సిద్ధిపేటలో గోల్కొండ హస్తకళల షోరూమ్‌ ‌ను ప్రారంభించినట్లుగానే., నిలబెట్టుకోవడం ముఖ్యమైన పనిగా వృత్తి కళాకారులకు ఆదరణ కలిగించాలని కోరారు. సిద్ధిపేటలో ఇప్పటికే శాలువా సన్మానానికి స్వస్తి పలికామని, తువ్వాలతో సన్మానాలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సామాజిక కార్యక్రమం ఏదైనా సరే.. వృత్తి కళలను, కళాకారులను ప్రొత్సహించేలా.. వృత్తిని నమ్ముకుని జీవించే కార్మికులను దీవిద్దామని కోరుతూ.. ఇక నుంచి వృత్తి కళలను నమ్ముకుని.. ఆత్మ గౌరవంతో బతికేలా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పూర్వ వైభవం తెచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక.., తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన చేసి, గోల్కొండను ప్రాచుర్యం తెచ్చేలా వృత్తి కళాకారులను ప్రోత్సాహిస్తున్నారని తెలిపారు. గతంలో సిద్ధిపేట గొల్లభామ చీరలకు 12వేలు ఉంటే.. ప్రస్తుతం 16వేల రూపాయలు ధర పలుకుతుందని, ప్రతి చేనేత కార్మికుడికి మిగులు లాభం వస్తుందని వెల్లడించారు. గొల్లభామ చీరలతో ప్రాచుర్యంలోకి వచ్చిన క్రమంలో త్రిఫ్ట్ – ‌చేనేతకు చేయూత కింద జకాట్‌ ‌మిషన్లు, కుట్టు మిషన్లు తీసుకుని శిక్షణ పొందితే.. మరో 30 మంది మహిళా కార్మికులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని., అందుకు అనుగుణంగా వారిని ప్రొత్సహించేలా కావాల్సిన చర్యలు చేపట్టాలని డైరెక్టర్‌ ‌శైలజా రామ అయ్యర్‌ ‌ను హరీశ్‌ ‌రావు కోరారు. గతంలో 3 రోజులకు ఒక్క గొల్లభామ చీరను నేసే నేత కార్మికుడు జకాట్‌ ‌మిషన్ల ద్వారా 6 గంటల్లో నేస్తున్నారని తెలుపుతూ.. బీడీలు తాగే వారు తగ్గి, కారా?నలు మూతబడుతున్నాయని.., అయితే బీడీలు చేసే కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ చేనేత వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారని చెప్పుకొచ్చారు. జిల్లాలోని 572 మంది చేనేత కార్మికులకు రూ.1.32కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది నేత కార్మికులకు 30కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రూ.400కోట్ల రూపాయల బతుకమ్మ చీరలు నేసి ప్రభుత్వం చేనేతకు చేయూతగా నిలిచిందని వెల్లడించారు. వృత్తి కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదరించేలా కృషి చేస్తుందని పేర్కొన్నారు. చేతి వృత్తి పై ఉన్న వారిని ఆదరించి 9 చేనేత సహకార సంఘాల అభివృద్ధి కోసం కృషి చేసేలా సంఘ సభ్యులుగా చేర్చి వారికి అవకాశం కల్పించాలని సహకార సంఘాలను కోరారు. ఎన్నో కళలకు, కళాకారులకు సిద్ధిపేట ప్రసిద్ధిగాంచిందని., ప్రముఖ చిత్ర కళాకారులు కాపు రాజయ్య, బాతిక్‌ ‌బాలయ్య, గొల్లబామ చీర, చేర్యాల నకాషీ తదితర అంశాలు వివరిస్తూ..
కళలను, కళాకారులను ప్రోత్సాహించి అంతరించి పోయిన కళలను కాపాడుకోవాలని కోరారు. మన సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఏదైనా సరే., శుభకార్యాలు, ఇతర వేడుకల సందర్భంగా ఈ హస్తకళల వస్తువులను గిఫ్ట్ ‌గా తీసుకోవాలని వృత్తి కళాకారులను ఆదరిద్దామని కోరుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో, కార్యాలయాల్లో గోల్కొండ షోరూంలో తయారు అయ్యే వస్తువులను ఖరీదు చేయాలని చెప్పారు.  అంతకు ముందు ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. చేతి వృత్తి కళాకారులకు, కళలన్నింటికీ నిలయంగా సిద్ధిపేట ఉందని., దీన్ని ముందు వరుసలో నిలుపాలని సిద్ధిపేట ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సంగారెడ్డి, సిద్ధిపేటలో గోల్కొండ షోరూమ్‌ ‌ప్రారంభించడం సంతోషదాయకమని తెలిపారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాల గోల్కొండ పూర్వ వైభవాన్ని.. మళ్లీ చాటి చెప్పేలా సిద్ధిపేటలో గోల్కొండ షోరూమ్‌ ‌ప్రారంభించుకోవడం సంతోషకరమైన అంశమని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌శైలజ్‌ ‌రామ అయ్యర్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో లక్షన్నర మంది హస్తకళల కళాకారులు ఉన్నారని, వారు చేతి వృత్తితో తయారు చేసిన వస్తువులు ఇక్కడ అమ్మకాలకు తీసుకువచ్చినట్లు., వారికి ఉపాధి ఇస్తూ.., వారిని గౌరవిస్తున్నామని తెలిపారు. చేతి వృత్తి కళలు అంతరించి పోకుండా రూ.13కోట్ల రూపాయల కొత్త వస్తువులతో తయారీ శిక్షణను త్వరలోనే ఇవ్వనున్నామని తెలిపారు. చేతి వృత్తిలకు కావాల్సిన సామాగ్రి యంత్రాంగం అందిస్తున్నట్లు పేర్కొంటూ.. ప్రపంచ, దేశ వ్యాప్తంగా మెషనర్లీతోనే కాలం నడుస్తుందని., అంతరించి పోతున్న కళా వృత్తులను కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని వివరించారు.  ఆ తర్వాత గోల్కొండ హస్తకళల విక్రయ షోరూమ్‌ ‌నిర్మాణానికి సహకరించిన అధికారులు, కాంట్రాక్టర్లను మెమెంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైండ్లూమ్‌ ఏడీ వెంకట రమణ, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.