వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌గాలి’కి ఎదురు గాలి

April 4, 2019

– తూతూమంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ ‌నాయకులు
– కూలీలతో, పసి పిల్లలతో ప్రచారంఒకప్పుడు కాంగ్రెస్‌ ‌కంచుకోటగా ఉన్న మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌ ‌కుమార్‌ ‌కుఎదురు గాలి వీస్తున్నది. ఆయన తరపున కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు తూతూమంత్రంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గం లోని ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేయడం లేదు. గాలి అనిల్‌ ‌కుమార్‌ ‌ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రం నాయకులు కార్యకర్తలు ఆయన వెంట ప్రచారంలో పాల్గొంటున్నారు. పటాన్‌చెరులో కూడా కాంగ్రెస్‌ ‌నాయకులు ప్రచారం చేయడం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. దెబ్బ మీద దెబ్బ ఎదురుదెబ్బ నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలో మాజీ మంత్రి వి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ ‌వీడి టిఆర్‌ఎస్లో చేయడంతో ఎన్నికల్లో మరింత నష్టం వాటిల్లుతుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను సమీకరించి వారిలో ఉత్సాహం నింపేందుకు చొరవ తీసుకోలేక పోతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ టికెట్‌ ‌పొందిన గాలి అనిల్‌ ‌కుమార్‌కు టీఆర్‌ఎస్‌ ‌కీలక నేతలతో సత్సంబంధాలున్నాయి. సదరు టిఆర్‌ఎస్‌ ‌కీలకనేత ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డికి 5 లక్షల పైచిలుకు మెజారిటీ తెచ్చి తన సత్తా చూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అందువల్ల ఎలాగో గెలిచే పరిస్థితులు లేవని. ఇక ప్రచారం చేసి ఎన్నో కొన్ని ఓట్లు ఎందుకు తనకు రాకుండా చేస్తారని సదరు టిఆర్‌ఎస్‌ ‌నేత కాంగ్రెస్‌ అభ్యర్థి వర్గీయులకు సూచించినట్లు తెలిసింది. మొక్కుబడిగా ప్రచారం చేసుకుంటే చాలని ఆ నేత అభిప్రాయ పడ్డట్లు తెలిసింది. రెండు రోజుల కిందట కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రకటించేందుకు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌సంగారెడ్డి కి వచ్చి సమావేశం నిర్వహించిన గాలి అనిల్‌ ‌కుమార్‌ ‌హాజరు కాలేదు. పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పార్టీ తనకు టిక్కెట్‌ ఇచ్చిందని అనిల్‌ ‌కుమార్‌ ‌పార్టీ వర్గాలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. భవిష్యత్తులో అవకాశాలు ఏమైనా వస్తాయన్న ఆశ తో పోటీకి దిగి ఈ మాత్రం ఖర్చు చేసుకుంటున్నానని అనిల్‌ ‌కుమార్‌ అం‌టున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పటాన్‌ ‌చెరువు పట్టణంలో బుధవారం పలు కాలనీలో తూతూమంత్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏదిఏమైనప్పటికిని కాంగ్రెస్‌ ‌నాయకులలో గూబులు పరిగెడుతుంది. ప్రత్యేకించి ప్రచారం చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.