Take a fresh look at your lifestyle.

‌కారు పార్టీకి వోట్లేస్తే కాళేశ్వరం నీళ్లు

నంగునూరు రోడ్‌ ‌షో ‌హరీష్‌రావు

జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు వోట్లేస్తే జాడ లేకుండా పోతారనీ…అదే ఇంటి పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి వోట్లేసి గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లొస్తాయి, మన బతుకులు బాగుపడుతాయనీ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌, ‌సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు అన్నారు. వచ్చే నెల 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మెదక్‌ ఎం‌పి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మద్దతుగా సిద్ధిపేట జిల్లా లోని నంగునూరు మండల కేంద్రంలో బుధవారం భారీ రోడ్‌ ‌షో, బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ….జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు వోట్లప్పుడే కనబడుతారు. వోట్లు అయిపోతే జాడ లేకుండా పోతారనీ అన్నారు. కానీ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజల మధ్యన ఉంటారనీ, ప్రజల బాధల్లో పాలు పంచుకుంటారన్నారు. అందుకే తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తప్ప ఏ పార్టీకి వోట్లు అడిగే హక్కే లేదన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలలో ఒకటి మిత్రపక్షమైన ఎంఐఎం పోగా మిగిలిన 16స్థానాలను గెలుచుకుని కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలనేది టిఆర్‌ఎస్‌ ‌పార్టీ డిసైడ్‌ ‌చేసే పరిస్థితి వసుందనీ…అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏమేమీ కావాలో వాటంతట అవే ఢిల్లీ నుంచి వస్తాయన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అంటే ఇంటి పార్టీ అని, పేదల గుండెల్లో నిలిచిన పార్టీ అని…అలాగే సిఎం కేసీఆర్‌ ‌రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపి రైతుబాంధవుడుగా నిలిచిపోయారన్నారు. పార్లమెంటు ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అన్ని స్థానాలను గెలుచుకోవడం చారిత్రాత్మక అవసరమనీ…కారుకు వోటేస్తేనే కాళేశ్వరం నీళ్లు త్వరగా వస్తాయనీ…కాళేశ్వరం నీళ్లు రాగానే ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కాళేశ్వరంతో బీడుబడ్డ భూములన్నీ పచ్చని పంట పొలాలతో కళకళలాడుతాయన్నారు. దేశంలోని 542లోక్‌సభ స్థానాలలో అత్యధిక మెజారిటీతో మెదక్‌ ‌నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలువబోతున్నాడనీ, అయితే సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ లక్ష్యం లక్ష వోట్ల మెజారిటీ అని దేశంలోనే కేపీఆర్‌కు భారీ రికార్డులో మెజారిటీ అందించడం ద్వారా సిఎం కేసీఆర్‌ ‌గౌరవాన్ని, సిద్ధిపేట గౌరవాన్ని మరోసారి చాటుదామనీ హరీష్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!