Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌దవాఖాన)పై.. భారం పడకుండా చూడండి

రాష్ట్రంలో కొరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ ఆసుపత్రులపై భారం పడకుండా ఎక్కడికక్కడే చికిత్స అందించేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆ ‌శాఖ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా డోర్‌ ‌టు డోర్‌ ‌పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మొదలుకుని ట్రౌమా కేర్‌ ‌దవాఖానల వరకు అవసరమైన మందుల కొనుగోలుపై మంత్రి మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిమ్స్, ‌గాంధీ ఆసుపత్రులలో సిబ్బంది నియామకపు ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇంకా ఎంతమంది అవసరమవుతుందో చూసుకుని ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలం సీజన్‌లో అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని టీఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు. ఏ ఒక్క ఆసుపత్రిలో కూడా మందులు లేవనే వార్తలు రావొద్దనీ,  అన్ని జిల్లాలలో ఉన్న మెడికల్‌ ‌కళాశాలల్లో కొరోనా పేషెంట్లను చేర్చుకునేందుకు సిద్ధం చేయాలని సూచించారు.

కొరోనా లక్షణాలు ఉన్న వారు అక్కడికి వెళ్లి పరీక్షలు
చేయించుకోవాలనీ, పరీక్షల కోసం వస్తున్న వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలనీ, పరీక్షా కేంద్రంలో విధిగా భౌతిక దూరం పాటించాలనీ లేదంటే అవే కొరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. పాజిటివ్‌ ‌వచ్చిన వారు తక్కువ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలనీ, వారికి ఉదయం, సాయంత్రం విధిగా కాల్‌ ‌సెంటర్‌ ‌నుంచి ఫోన్‌ ‌చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని ఆదేశించారు. రోగికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలనీ, ప్రభుత్వ ఆసుపత్రులకు పరీక్షల కోసం, చికిత్స కోసం అడ్మిట్‌ అయిన ప్రతీ పేషెంట్‌ ‌వద్దకు డాక్టర్‌, ‌నర్స్ ‌తప్పనిసరిగా రోజుకు మూడుసార్లు పరీక్షలు చేయాలని ఆదేశించారు.

జీహెచ్‌ఎం‌సీ పరిధిలో ఉచిత కొరోనా పరీక్షలు ప్రారంభం
జీహెచ్‌ఎం‌సి పరిధిలో ఉచిత కొరోనా పరీక్షలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఒక్కో పరీక్ష కేంద్రంలో 250 నమూనాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో 50 వేల మంది నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో గత నెల 16 నుంచి 9 రోజుల పాటు దాదాపు 36 వేల నమూనాలు సేకరించారు. వ్యాధి నిర్ధారణ కేంద్రాలు రోజంతా పనిచేసినా సేకరించిన నమూనాల పరీక్షించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు నమూనాల సేకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. పెండింగ్‌లో ఉన్న నమూనాల పరీక్షలు పూర్తి కావడంతో మంగళవారం నుంచి తిరిగి ఉచిత కొరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియను ప్రారంభించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!