Take a fresh look at your lifestyle.

హైకోర్టు ఎక్కడుందనేది సమస్య కాదు..

పేదలకు న్యాయం త్వరగా జరగాలి..
ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే విశాఖ లోనూ, అమరావతిలోనూ బెంచ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పాలనా సౌలభ్య కోసం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టాలనే ఆలోచనలో ఉంది. అందువల్ల విశాఖ, అమరావతిలలో బెంచ్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలనలోకి తీసుకోవడం అవసరం. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టుకూ, కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు అదనపు బెంచ్‌లు ఇప్పటికే ఉన్నాయి. అలా చేస్తే కక్షిదారులకు ప్రభుత్వం మహోపకారం చేసినట్టు అవుతుంది.
ఇందుకు సమాధానం చాలా స్పష్టంగా, కళ్లెదుట కనిపిస్తోంది. చట్టాలు న్యాయాన్ని రక్షించడమే కాకుండా, న్యాయం జరిగేట్టు చూడాలి. న్యాయం వివక్షంగా ఉండకూడదు. న్యాయమే సాధనం. న్యాయమే అంతిమం. మన రాజ్యాంగం దేశంలో ప్రజలందరికీ న్యాయం, ఉచిత న్యాయం అందేట్టు చూసేందుకు హామీ ఇచ్చింది. న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు న్యాయం జరిగేట్టు ప్రభుత్వం చూస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఏ ఒక్క పౌరునికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థదే. న్యాయం కోరి వొచ్చే వారికి సహాయం ప్రభుత్వం సాయం అందించాలి. న్యాయవాదిని నియమించుకోలేని వారికి ప్రభుత్వమే సాయం అందించాలి. ఆర్థికంగా లేని వారైనా, సామాజికంగా వెనుకబడిన వారైనా అందరికీ న్యాయవాదిని నియమించుకోవడంలో ప్రభుత్వం సాయపడాలి. న్యాయవ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. న్యాయం అందరికీ అందేట్టు చూడాలి. కేవలం బ్రిటిష్‌ ‌వారి కాలం నాటి సంప్రదాయాలను కొనసాగించడం కాదు. రాజ్యాంగంలోని 214 అధికరణం కింద ప్రతి రాష్ట్రానికీ హైకోర్టు ఉండాలి. హైకోర్టు ఎక్కడ ఉండాలనేది రాజ్యాంగంలో స్పష్టత లేదు. అంటే రాష్ట్ర రాజధానిలోనే ఉండాలా అనే విషయంలో స్పష్టత లేదు.
1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 51వ సెక్షన్‌ ‌ప్రకారం హైకోర్టు ప్రధాన కార్యాలయం, హైకోర్టు ఏయే ప్రాంతాల్లో సమావేశం కావచ్చో తెలిపింది. అంటే హైకోర్టు కాకుండా వివిధ ప్రాంతాల్లో అదనంగా హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని, హైకోర్టు లేవు. అందువల్ల హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఈ చట్టంలోని సెక్షన్‌ 51 ‌కింద నిబంధనలను వర్తింపజేయవచ్చు. సామాన్యుల సమస్యలే ప్రధాన ప్రాతిపదిక కావాలి. ఆంధ్రప్రదేశ్‌ ‌పెద్దదే కాకుండా, సువిశాలమైనది. సామాన్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. దూర భారాలు, ప్రయాణ చార్జీలు, న్యాయవాదులను నియమించుకోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. హైకోర్టు నెలకొని ఉన్న నగరంలో సామాన్యులు, కక్షిదారులకు వసతి సౌకర్యం మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ పూర్తిగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చేయాలి. సమాన అవకాశాల ప్రాతిపదికగా న్యాయవ్యవస్థ ఉండాలి. అంతేకప్ప హైకోర్టు నెలకొల్పే ప్రదేశంలో ఉండేవారి సౌలభ్యం కోసం కాదు. అదే సందర్భంలో ఇతర ప్రాంతాల వారికి సమాన అవకాశం కల్పించడం కోసం ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట్ల బెంచ్‌లను ఏర్పాటు చేయవచ్చు. ఒక చోట తప్ప ఇతర చోట్ల బెంచ్‌లు ఏర్పాటు చేయడానికి వీలు లేకపోతే ఇప్పటి మాదిరిగానే ప్రజలకు వసతిపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే విశాఖ లోనూ, అమరావతిలోనూ బెంచ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పాలనా సౌలభ్య కోసం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టాలనే ఆలోచనలో ఉంది. అందువల్ల విశాఖ, అమరావతిలలో బెంచ్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలనలోకి తీసుకోవడం అవసరం. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టుకూ, కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు అదనపు బెంచ్‌లు ఇప్పటికే ఉన్నాయి. అలా చేస్తే కక్షిదారులకు ప్రభుత్వం మహోపకారం చేసినట్టు అవుతుంది. కర్నాటక హైకోర్టు ప్రధాన బెంచ్‌ ‌బెంగళూరులో ఉండగా, ధార్వాడ్‌, ‌గుల్బర్గాల్లో బెంచ్‌లు ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన బెంచ్‌ ‌ముంబాయిలో ఉండగా, నాగపూర్‌, ‌పనాజీ, ఔరంగాబాద్‌లలో బెంచ్‌లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు ప్రధాన బెంచ్‌ ‌జబల్‌ ‌పూర్‌లో ఉండగా, గ్వాలియర్‌, ఇం‌డోర్‌లలో బెంచ్‌లున్నాయి. న్యాయాన్ని ప్రజలకు చేరువగా తీసుకుని వెళ్ళేందుకు బెంచ్‌లు ఏర్పాటు చేయడమే ఉత్తమ మార్గం.

– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!