Take a fresh look at your lifestyle.

హైకోర్టుకు నూరేళ్ళు

‌జైపూర్‌కు చెందిన ఇంజనీర్‌, ఆర్కిటెక్ట్ ‌శంకర్‌ ‌లాల్‌ ఈ ‌భవన సముదాయానికి నమూనాలు తయారు చేశారు. స్థానిక ఇంజనీర్‌ ‌మెహర్‌ ఆలీ ఫజల్‌ ‌నిర్మాణ పనులను పర్యవేక్షించారు.బ్రిటిష్‌ ఇం‌జనీర్‌ ‌విన్‌ ‌సెంట్‌ ‌జెఎక్‌ ‌ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ భవన నిర్మాణం జరిపించేందుకు శ్రద్ధ తీసుకున్నారు. 18,22,750 రూపాయిల అంచనాకు నవరతన్‌ ‌దాస్‌ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన కాంట్రాక్టును సొంతం చేసుకున్నారు. నిజాం నవాబు ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు భవనానికి తాపడం చేయించారు. గులాబీ రంగు గ్రానైట్‌, ‌రాతితో హైకోర్టు భవనాన్ని అద్భుతమైన కళాఖండంగా తీర్చి దిద్దారు. ఇండో-ఇస్లామిక్‌ ‌సంప్రదాయ రీతుల్లో డోమ్‌ల ఆకృతిలో ఆధునికంగా, ఆకర్షణీయంగా రూపు దిద్దారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ భవన సముదాయం నిలిచింది. ఇందుకు నిదర్శనంపై భాగంలో రామ్‌ ‌రహీమ్‌ అనే అక్షరాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి.తెలంగాణ హైకోర్టును హైదరాబాద్‌ ‌హైకోర్టు అని కూడా అంటారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అపురూపమైన భవన నిర్మాణ ఆకృతిని సొంతం చేసుకున్న ఈ హైకోర్టు భవనాలు హైదరాబాద్‌ ‌ఠీవికి తగినట్టుగానే ఉంటాయి. మొగలాయీ సారాసెంటిక్‌ ఆకృతిలో వీటిని మూసీ నది ఒడ్డున దక్షిణం వైపున నిర్మించారు. జైపూర్‌కు చెందిన ఇంజనీర్‌, ఆర్కిటెక్ట్ ‌శంకర్‌ ‌లాల్‌ ఈ ‌భవన సముదాయానికి నమూనాలు తయారు చేశారు. స్థానిక ఇంజనీర్‌ ‌మెహర్‌ ఆలీ ఫజల్‌ ‌నిర్మాణ పనులను పర్యవేక్షించారు. బ్రిటిష్‌ ఇం‌జనీర్‌ ‌విన్‌ ‌సెంట్‌ ‌జెఎక్‌ ‌ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ భవన నిర్మాణం జరిపించేందుకు శ్రద్ధ తీసుకున్నారు. 18,22,750 రూపాయిల అంచనాకు నవరతన్‌ ‌దాస్‌ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన కాంట్రాక్టును సొంతం చేసుకున్నారు. నిజాం నవాబు ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు భవనానికి తాపడం చేయించారు. గులాబీ రంగు గ్రానైట్‌, ‌రాతితో హైకోర్టు భవనాన్ని అద్భుతమైన కళాఖండంగా తీర్చి దిద్దారు. ఇండో-ఇస్లామిక్‌ ‌సంప్రదాయ రీతుల్లో డోమ్‌ల ఆకృతిలో ఆధునికంగా, ఆకర్షణీయంగా రూపు దిద్దారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ భవన సముదాయం నిలిచింది. ఇందుకు నిదర్శనంపై భాగంలో రామ్‌ ‌రహీమ్‌ అనే అక్షరాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. నిజాం కళా వైభవానికి చిహ్నంగా ఈ భవనాలను నిర్మించారు. బార్‌ అసోసియేషన్‌కు అనుగుణంగా భవన నిర్మాణం చేపట్టారు. 1958 జూలై పదవ తేదీన మరో రెండు బ్లాకుల నిర్మాణాన్ని చేపట్టారు.
హైకోర్టు భవనం పక్కనే జజ్గీ ఖానా అనే దవాఖానా ఉంది. ఈ దవాఖానా నిజాం కాలం నుంచి పేదలకు వైద్యాన్ని అందిస్తోంది. ఆ దవాఖానాను మరో ప్రాంతానికి తరలించి ఆ దవాఖానా సముదాయానికి చెందిన 9.5 ఎకరాల భూమిని 2009లో హైకోర్టుకు అప్పగించారు. 1928లో హైకోర్టు చట్టం కింద బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసుల విచారణ చేపట్టడం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ ‌సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయింది. అందుకు దారి తీసిన పరిస్థితులు, సర్దార్‌ ‌పటేల్‌ ‌కృషి అంతా తెలిసిందే. ఆ తర్వాత ఈ కోర్టు హైకోర్టు ఆఫ్‌ ‌హైదరాబాద్‌గా కొనసాగింది. 1956 తెలుగు ప్రజలకు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు 11 మంది న్యాయమూర్తులతో ప్రారంభమైంది. హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌కోకా సుబ్బారావు, మొదటి అడ్వకేట్‌ ‌జనరల్‌గా దువ్వూరి నరసరాజు వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన తర్వాత కూడా ఉమ్మడి హైకోర్టుగా కొనసాగిన ఈ హైకోర్టు ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వులతో రెండుగా విభజన అయింది. ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు అమరావతిలో ఏర్పడగా, తెలంగాణ హైకోర్టుగా హైదరాబాద్‌ ‌హైకోర్టు స్థిరపడింది.
ఈ హైకోర్టులో 1883 వరకూ పర్షియన్‌ ‌భాషలో కార్యకలాపాలు జరిగేవి. 1884లో ఉర్దూలో ప్రారంభమైనాయి. ఆంగ్ల భాషను నిషేధిస్తూ ఒక సర్క్యులర్‌ను అప్పట్లో విడుదల ఛేశారు. న్యాయమూర్తులను నిజాం ఫర్మానాతో నియమించేవారు. న్యాయమూర్తులతో సహా న్యాయశాఖ సభ్యులంతా హైదరాబాద్‌ ‌సర్వీస్‌ ‌రూల్స్ ‌పరిధిలో పని చేసేవారు. 19వ శతాబ్దంలో పలు చట్టాలు, బ్రిటిష్‌ ఇం‌డియాలో హైదరాబాద్‌కు కూడా అమలులోకి వచ్చాయి. హైకోర్టు విధివిధానాలను క్రమబద్ధం చేస్తూ 1893లో దస్త్రు-అల్‌-అమల్‌ను విధించారు. హైకోర్టును మొదట పత్తర్‌ ‌గట్టి వద్ద ఏర్పాటు చేశారు. మూసీ నది వరదల వల్ల 1909లో నవాబ్‌ ‌సర్‌ అస్మాన్‌ ‌ఝా నివాసం అయిన లాల్‌ ‌బాగ్‌కు తరలించారు. 1912లో కలరా వ్యాధి వ్యాపించడం వల్ల పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లోని అడ్రస్‌ ‌హాల్‌కు తరలించారు. నాలుగు నెలల తర్వాత హైకోర్టును సాలార్‌ ‌జంగ్‌ ‌బహుదూర్‌ ‌నివాసమైన లక్కడ్‌ ‌కోటికి తరలించారు. అది సరిగా లేదని 1914లో ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణాన్ని ప్రారంభించారు.1919 మార్చి 31వ తేదీకి ప్రస్తుత భవనాలు పూర్తి అయ్యాయి. ఈ భవనాలను ఏడవ నవాబు ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌ప్రారంభించారు. ఈ భవనం కుతుబ్‌ ‌షాహీ ప్యాలెస్‌ ‌శిధిలాలపై నిర్మించారు.
ఈ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులకు నియమితులైన వారిలో జస్టిస్‌ ‌కోకా సుబ్బారావు, జస్టిస్‌ ‌పి సత్యనారాయణ రాజు జస్టిస్‌ ‌పి రామస్వామి, జస్టిస్‌ ఒ ‌చిన్నప్పరెడ్డి, జస్టిస్‌ ‌కె జయచంద్రారెడ్డి, జస్టిస్‌ ‌పి వెంకట్రామరెడ్డి, జస్టిస్‌ ‌బి సుదర్శన రెడ్డి, జస్టిస్‌ ఎన్‌వి రమణ, జస్టిస్‌ ఆర్‌ ‌సుభాష్‌ ‌రెడ్డి ప్రభృతులు ఉన్నారు.

– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!