Take a fresh look at your lifestyle.

హెల్త్‌సెంటర్‌లో వైద్యుల సేవలు కరువు

జనగామ అర్బన్‌ ‌హెల్త్‌సెంటర్‌లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో అసలే వేసవికాలం కావడంతో రోగులు, పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారు. స్థానిక ధర్మకంచలోని అర్భన్‌ ‌హెల్త్‌సెంటర్‌లో వైద్యులు సమయ పాలన పాటించకుండా నామమాత్రంగా సేవలు అందిస్తున్నారనే పలువురి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రజాతంత్ర ప్రతినిధిహెల్త్ ‌సెంటర్‌ను సందర్శించడంతో ఆరోపణలు వాస్తవాలుగా వెలుగులోకి వచ్చాయి. ఉదయం 9గంటలకు రావాల్సిన వైద్యులు10:40 గంటల వరకు రాకపోవడంతో అర్భన్‌హెల్త్ ‌సెంటర్‌లోని రక్త, మూత్ర పరీక్ష) కేంద్రాన్ని ప్రారంభంచి సుమారుగా ఏడాది కావొస్తున్నా ఎలాంటి పరీక్షలకు నోచుకోలేదు. హెల్త్ ‌సెంటర్‌లో కేవలం చిన్న పిల్లలకు వ్యాక్సీన్‌లు వేయడానికి మాత్రమే పనిచేస్తుందని, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు సంభవిస్తే పరీక్షలు లేవంటూ జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి అర్భన్‌ ‌హెల్త్‌సెంటర్‌లో వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించేలా తగుచర్యలు తీసుకుని, ల్యాబ్‌లో అన్ని రకాల పరీక్షలను చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి మహేందర్‌ను ప్రజాతంత్ర వివరణకోరగా వైద్యుల నుంచి వివరణ తీసుకుని సమయ పాలన పాటించేలా, ల్యాబ్‌లో రక్తమూత్ర పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!