Take a fresh look at your lifestyle.

హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉత్తమ్‌ ‌రాజీనామా

అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందజేత

శాసనసభ్యత్వానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ
కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేశారు. ఈ విషయమై అంతకుముందు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డితో ఉత్తమ్‌ ‌మాట్లాడారు. ఆ తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి రాజీనామాను సమర్పించారు. మరోవైపు ఉత్తమ్‌ ‌రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ ‌నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆయన సతీమణి పద్మావతిని బరిలోకి దించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కోదాడ నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థి మల్లయ్య యాదవ్‌ ‌చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు టిఆర్‌ఎస్‌ ‌సిద్దంగా ఉంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!